Featuredక్రైమ్ న్యూస్

గొలుసుకట్టు బద్మాష్‌ అరెస్ట్‌

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

అగరబత్తీలతో మోసాలకు తెరలేపాడు. కట్టుడు పళ్ళు, ఎరుల వ్యాపారం… చివరకు పల్లీ నూనె పేరుతో కోట్లు కొల్లగొట్టిన గ్రీన్‌ గోల్డ్‌ బయోటెక్‌ ఎండీ శ్రీకాంత్‌ అలియాస్‌ జిన్నా కాంతయ్య అలియాస్‌ జిన్నా కాంతి అలియాస్‌ విశ్వసాయి అలియాస్‌ శ్రీకాంత్‌ అలియాస్‌ విశ్వకాంత్‌ అలియాస్‌ జిన్నా శ్రీకాంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కళ్ళు తెరిచేటప్పటికే 100 కోట్లు కొట్టేశాడు. తీరా రికవరీ మొత్తం కనీసం కోటిన్నర కూడా దాటలేదు. మరి గతంలో తిన్నది, ఇప్పుడు మెక్కింది ఎన్నాళ్ళకు కక్కిస్తారో..లేదో..మరి. ఇతగాడి బాగోతంపై ఈనెల 24న ‘గొలుసుకట్టు బద్మాష్‌’ పేరుతో కథనం ఆదాబ్‌ హైదరాబాద్‌ ఒక ప్రత్యేక కథనం అందించింది.

అరెస్టులు ఇలా..:

శ్రీకాంత్‌ తో పాటు భాస్కర్‌ యాదవ్‌, లంకా ప్రియ, అహల్యరెడ్డి, అనిల్‌ రెడ్డి, అంజయ్య గౌడ్‌, సంతోష్‌ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే పల్లీ నూనె తీసే యంత్రం ఇస్తామని, ఆ తర్వాత పల్లీ నూనె తీసిస్తే తాము అమ్ముతామని, అలా నెలకు 20వేల రూపాయలు సంపాదించుకోవచ్చని శ్రీకాంత్‌ ప్రజలను నమ్మించాడు. శ్రీకాంత్‌ ని గుడ్డిగా నమ్మిన ప్రజలు పెద్ద సంఖ్యలో డబ్బు డిపాజిట్‌ చేశారు. ఇలా కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు చేశాడు. ఆ తర్వాత బోర్డు తిప్పేసి పారిపోయాడు. శ్రీకాంత్‌ నిజామాబాద్‌ వాసి. ఉప్పల్‌ స్టేషన్‌ లో ఇతనిపై కేసు నమోదైంది. గతంలోనూ శ్రీకాంత్‌ పై పలు చీటింగ్‌ కేసులు ఉన్నాయి.

రూ. లక్ష కట్టిన తమకు తొలుత డబ్బు సక్రమంగానే చెల్లించిన శ్రీకాంత్‌, తర్వాత డబ్బివ్వడం మానేశాడు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితుల పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో ఉప్పల్‌ పోలీసులు రంగంలోకి దిగారు. వారం రోజుల పాటు దర్యాఫ్తు చేసిన పోలీసులు శ్రీకాంత్‌ ప్రజలను మోసం చేశాడని తేల్చారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌, గతంలోనూ పలు ఆకర్షణీయమైన స్కీములను ప్రకటించి ప్రజలను చీట్‌ చేశాడని గుర్తించారు. అతనిపై గతంలోనే బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారని, ఇప్పుడు అతని అరెస్ట్‌ తో పాత కేసులనూ విచారిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

గ్రీన్‌ గోల్డ్‌ బయోటెక్‌ సంస్థ చైన్‌ సిస్టమ్‌ ద్వారా ప్రజల నుండి డబ్బు వసూలు చేసినట్టు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ చెప్పారు. పల్లీ నూనె స్కీమ్‌ బాగా పాపులర్‌ అయ్యిందన్నారు. దీంతో జనాలు ఈజీగా మోసపోయారని అన్నారు. వరంగల్‌, కడప జిల్లాల్లో శ్రీకాంత్పై పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు.

I శ్రీకాంత్తో పాటు భాస్కర్‌ యాదవ్‌, లంకా ప్రియ, అహల్యరెడ్డి, అనిల్‌ రెడ్డి, అంజయ్య గౌడ్‌, సంతోష్‌ అరెస్ట్‌.

I నిందితుల నుండి రూ.21 లక్షలు స్వాధీనం

I బ్యాంకులో రూ.90 లక్షలు సీజ్‌

I వేరుశనగ నూనె తీసే మిషన్లతో పాటు వేరుశనగ ఇతర వస్తువులు కలిపి రూ.5 కోట్ల ఆస్తులు గుర్తింపు

I గ్రీన్‌ గోల్డ్‌ బయోటెక్‌ అకౌంట్లు సీజ్‌

I వేరుశనగ నూనె తీసే యంత్రాలను రూ లక్ష చొప్పున అమ్మిన శ్రీకాంత్‌

I రూ.100 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డ శ్రీకాంత్‌

I రకరకాల స్కీమ్ల పేరుతో ప్రజలను మోసం చేసిన శ్రీకాంత్‌

I 4 రాష్ట్రాల్లో 70మంది డీలర్లను నియమించుకున్న శ్రీకాంత్‌

ఇవీ కేసులు:

సనత్‌ నగర్‌ పిఎస్‌ లో క్రైం నెంబరు 402/2004,

సైబరాబాద్‌

క్రైం నెం. 116/2007 స్పెషల్‌ టీం -ఎఎ, అఅూ వద్ద పంజాగుట్ట పోలీస్టేషన్‌ క్రైం.నెం. .308 / 2009, బంజారా హిల్స్‌ పోలీస్టేషన్‌ క్రైం.నెం..206 / 2012

కాకతీయ యూనివర్శిటీ పోలీస్టేషన్‌ క్రైం.నెం. 42/2013 ,

కడపజిల్లా, రాజంపేట పోలీస్టేషన్‌ క్రైం 67/2017,

కడప జిల్లా, నందనారు పోలీస్టేషన్‌ క్రైం.నెం. 132/2017.

అల్లిబిల్లి కంపెనీలు:

1) 2000లలో సమిష్టి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

ధూపం వ్యాపారం (అగర్‌ బత్తి)

2) 2004లో

మహా లైఫ్‌ ఆన్‌ లైన్‌ మార్కింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

హౌసింగ్‌ వ్యాపారం

3) 2009లో

గ్రీన్‌ గోల్డ్‌ బయోన్ఫ్ఫ్రా ఇండియా ప్రెవేట్‌. లిమిటెడ్‌.

సేంద్రీయ ఎరువులు కట్టుడు పళ్ళు

4) 2011లో

జిన్నా ట్రేడింగ్‌ కంపెనీ లిమిటెడ్‌

కాగితం సంచుల తయారీ

కొసమెరుపు ఏమిటంటే…చిన్న,చిన్న విషయాలకు హడావుడి చేసే ఖాకీలు సామాన్యుల కోట్ల సొత్తును అప్పనంగా ఆరగించిన ఈ మహానుభావడిపై పిడీ యాక్ట్‌ ఎందుకు పెట్టడం లేదబ్బా… ఏమైనా మతలబు ఉందా..?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close