Featuredవిద్య

ఇంటర్న్‌షిప్‌ చేయకుండానేే సర్టిఫికెట్లు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎంబిబిఎస్‌ చదవాలి.. నాలుగు సంవత్సరాలు పుస్తకాలతో కుస్తీబట్టి, ఆసుపత్రుల్లో వైద్యుల పనితీరు గమనిస్తూ ఉండాలి. నాలుగు సంవత్సరాల చదువు పూర్తికాగానే ప్రతి వైద్యుడు తప్పనిసరిగా ఇంటర్నిషిప్‌ చేయాల్సిందే.. నాలుగు సంవత్సరాలు చదివిన చదువువేరు. ఒక సంవత్సరం ఇంటర్నిషిప్‌లో నేర్చుకున్నది వేరు. వైద్య రంగంలో ఎన్ని శాఖలున్నాయి. ఏఏ శాఖ ఏలా పనిచేస్తుంది. అందులో సమస్యలు ఏలా అధిగమించాలి అంటూ వివిధ రంగాలపై అవగాహన కలిగించేందుకు ఎంబిబిఎస్‌ పూర్తి ఐనా ప్రతి వైద్య విద్యార్థికి ఇంటర్నిషిప్‌ చేయాలని ప్రభుత్వ నిబంధనలు చెపుతున్నాయి. ఇంటర్న్‌షిప్‌ చేయలేని వారికి కనీస అవగాహన ఉండదని, పన్నెండు నెలలు సీనియర్‌ వైద్యుల ద్వారా వ్యాధులకు సంబంధించిన అంశాలపై వివరంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఎంబిబిఎస్‌తోనే ఆగిపోయే సొంత క్లీనిక్‌లు నడిపిస్తారు. మరికొంతమంది ప్రాథమిక ఆసుపత్రులలో వైద్యుడిగా జాయిన్‌ అవుతారు. ఎంబిబిఎస్‌ చదివిన వారు పూర్తిగా వివిధ అంశాలపై నేర్చుకోవాలంటే అదీ ఇంటర్నిషిప్‌ ద్వారానే సాధ్యమవుతుందని సీనియర్‌ వైద్యులు చెపుతున్నారు. కాని మన తెలంగాణలోని పలు మెడికల్‌ కాలేజీలో ఇంటర్నిషిప్‌ సర్టిఫికెట్ల వ్యవహారం ఒక దందాగా మారిపోయింది. చేసినా, చెయ్యకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అటెండెన్స్‌ మాత్రం ప్రతిరోజు హజరైనట్టే ఉంటుంది. వైద్యశాఖలో చెపుతున్నదీ వేరు, మెడికల్‌ కాలేజీలలో జరుగుతున్నదీ వేరుగా ఉంది. నువ్వు ఎంబిబిఎస్‌ పూర్తవ్వగానే ఇంటర్న్‌షిప్‌లో నామమాత్రంగా జాయిన్‌ ఐతే చాలు మిగత విషయాలన్నీ తామే చూసుకుంటామంటున్నారు. మీరు వచ్చినా, రాకున్నా మేము మాత్రం పట్టించుకోము కాకపోతే మాకు ఇవ్వాల్సిన అమ్యామ్యాలు మాకు ఇస్తే చాలంటున్నారు ఆయా రంగాలకు చెందిన వైద్య సిబ్బందీ, అధికారులు….

చేసిన వాళ్లకే పెరుగుతున్న పని ఒత్తిడి..

ఉస్మానియా ఆసుపత్రికి చెందిన నరేష్‌ నాలుగు సంవత్సరాలు ఎంబిబిఎస్‌ చదివాడు. ఎంబిబిఎస్‌ పూర్తికాగానే ఎండి. నీట్‌లాంటి పై చదువులు చదవడానికి తగినంత సమయం లేక, మళ్లీ అంత ఆర్థికస్ధోమత లేక ఎంబిబిఎస్‌తోనే సరిపెట్టుకుందామని డిసైడ్‌ అయ్యాడు. ముందు ముందు ఆర్థికంగా స్థిరపడ్డాక ఆలోచిద్దామని ఇంటర్నిషిప్‌లో జాయిన్‌ అయ్యాడు. ఇంటర్నిషిప్‌ సంవత్సరం చేస్తే చాలు వైద్యరంగంలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన వస్తుంది. నెలకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌గా 19,400 కూడా చెల్లిస్తుంది. స్కాలర్‌షిప్‌ తీసుకుంటూ సంవత్సరం విద్యార్థులు చదివిన మెడికల్‌ కాలేజీలోనే ఇంటర్నిషిప్‌ పూర్తి చేయాలి. ఆసుపత్రిలోని జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, పిడియాట్రిక్‌, గైనకాలజీ, అర్థోపెడిక్‌ వంటి పెద్ద పెద్ద డిపార్ట్‌మెంట్లు, ఈఎన్‌టి, ఆప్తమాలజీ, క్యాజువాలిటీ, డెర్మటాలజీ, రేడియాలజీ, టర్మటాలజీ వంటి చిన్న డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అన్నింటిపై అవగాహన అనేది ప్రతి వైద్య విద్యార్థికి తప్పనిసరి. వాటిపై అవగాహన వస్తేనే ప్రభుత్వంలో కాని ప్రయివేట్‌లో కాని నిలదొక్కుకుంటారు. ఇంటర్నిషిప్‌లో జాయిన్‌ ఐనా నరేష్‌ బ్యాచ్‌లో ఇతనిపై ముప్పై మంది జాయిన్‌ అయ్యారు. కాని ప్రతిరోజు వచ్చేది మాత్రం నలుగురు, ఐదుగురుమాత్రమే. మిగతా ముప్పై మంది పని కూడా ఈ నలుగురు, ఐదుగురిపై పడడంతో పని ఒత్తిడిని తట్టుకోలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అందరికి సమానంగా స్కాలర్‌షిప్‌ వస్తుంది. సమానంగానే హజరుకాకున్నా అటెండెన్స్‌ పడుతొంది. దీనిపై డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదులందినా పట్టించుకోవడం లేదని మిగతా డాక్టర్లు వాపోతున్నారు. గత పది సంవత్సరాల క్రితం అక్కడక్కడా ఇద్దరూ, ముగ్గురితో ఉన్న ఈ మాఫీయా నేడు యాభై శాతం వరకు చేరింది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఇంటర్నిషిప్‌ చేయకుండానే చేసినట్లు సర్టిఫికెట్లు తీసుకుంటారని అలా జరిగితే మాత్రం నూతనంగా వైద్యరంగంలోకి అడుగుపెట్టేవారికి అవగాహన తక్కువగా ఉంటుందన్నారు సీనియర్‌ వైద్యులు..

ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీలో మరీ ఆధ్వాన్న పరిస్థితి..

ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించేవారికి మాత్రం అసలు ఇంటర్నిషిప్‌ చేసినట్లు, చేస్తున్నట్లు ఎక్కడా రుజువులే లేవు. ఎంబిబిఎస్‌ పూర్తయ్యాక అక్కడి విద్యార్థులు పేరుకు మాత్రమే ఇంటర్నిషిప్‌ చేస్తున్నట్లు చూపెడుతున్నారు కాని వారు ఒక్కరోజు కూడా ఆసుపత్రులకు పోయిన సందర్బాలు లేదు. ప్రయివేట్‌ ఆసుపత్రుల యజమాన్యం కూడా ఒక్కరోజు ఇంటర్నిషిప్‌ హజరుకాకుంటే రోజుకు వెయ్యి రూపాయలు చొప్పును వసూలు చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. సంవత్సరం చేయాల్సిన ఇంటర్నిషిప్‌కు ఒకటే సారి మూడులక్షల ఆరవై వేల రూపాయలు చెల్లించి చివరిరోజు వెళ్లి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఈ తతంగంపై కొంతమంది బోధన వైద్యులు డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు సంవత్సరానికి ఇచ్చే డబ్బులతో పాటు, వారి పేరు మీద వచ్చే నెలకు 19,400 స్కాలర్‌షిప్‌ను కూడా వారే నొక్కెస్తున్నట్లు చెపుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close