Featured

సామాన్యుడి సుధీర్ఘ పోరాటం డిఐజి పాల్‌ రాజ్‌ పై కేంద్రం విచారణ

  • దక్షిణ భారతంలో ఇదే ప్రథమం
  • న్యాయాధికారులపై కూడా..!
  • ఒకే కేసులో రెండుసార్లు అరెస్ట్‌
  • రంగంలోకి దిగిన ‘విజిలెన్స్‌’

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

దక్షిణ భారతదేశ పోలీస్‌ చరిత్రలో ఓ డిఐజిపై విచారణ జరగటం ఇదే ప్రథమం. విషయం చిన్నదే.! అంశం గంభీరంగా మారింది. హైదరాబాద్‌ సిసిఎస్‌ డిసిపిగా పనిచేసిన సందర్భంగా 2014లో జరిగిన సంఘటన ఇది. కాలంతో పాటు కేసు కూడా అనేక మలుపులు తిరిగి ఈస్థాయికి చేరింది.

పట్టువదలని విక్రమార్కుడిలా ఓ సామాన్య పౌరుడి అంచెలంచెల పోరాటం. రాష్ట్రపతికి అందిన ఫిర్యాదుతో కేంద్ర ¬ంశాఖ విజిలెన్స్‌ ను (నెం. 146383/2019/విజిలెన్స్‌-9)

రంగంలోకి దిగింది. దీంతో ఈకేసును ప్రభావితం చేసిన వారందరూ ఒకొక్కరుగా బయటపడే అవకాశం ఉంది. సగర్వంగా తలెత్తుకోవలసిన నాలుగవ సింహం నేల చూపులు చూడటం అవాంఛనీయం. దురదృష్టం. ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది.. ఆంధ్రప్రదేశ్‌ డిఐజి పాల్‌ రాజ్‌. ఆధారాలతో ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ‘సంచలన పరిశోధన’ కథనం.

అతను ఐపిఎస్‌ అధికారి. అధికారంలో ఓ ముఖ్యమంత్రి వెనుక తెల్ల వెంట్రుకల వ్యక్తిగత సహాయకుడు. ఆపద వస్తే కాపాడతాడని ఆలోచన. అసలే ఖాకీ అందుకు అధికారం కూడా కలసి ఓ సామాన్యుడిని.. ఒకే కేసులో రెండుసార్లు అరెస్ట్‌..ఆ కేసులో ఎన్నో పొరపాట్లు..మలుపులు.. ఏస్థాయికి కేసు వెళ్ళినా ఆస్థాయిలో ప్రభావితం. ఒకవైపు సామాన్యుడు. మరోవైపు తప్పులు చేస్తున్న వ్యవస్థ. ఎట్టకేలకు అనేక మలుపుల మధ్య.. కేసు న్యాయస్థానం పరిధి.. మేనేజ్‌.. హైకోర్టులో మేనేజ్‌.. సుప్రీంకోర్టు.. తొలుత మేనేజ్‌.. రెండో అంచెలో ఉంది.. ఈ నిజాలు తెలిస్తే.. యావత్‌ భారతదేశం వీస్తుబోతోంది. చక్రం తిప్పింది.. ‘రాజకీయ-ఖాకీ’పై.. ఓ సామాన్యుడి అసాధారణ పోరాటం. అరాచకీయానికి అధికార దుర్వినియోగం తోడైతే ఇలాంటి అమానవీ కోణంతో కూడిన సంటనలు జరుగుతాయి. ఎట్టకేలకు రాష్ట్రపతి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కేంద్ర విజిలెన్స్‌ విభాగం.

ఫిర్యాదు లేకుండానే ‘లిప్టింగ్‌’:

ఎక్కడైనా, ఎవరైనా పిర్యాదు చేసిన తరువాత నిందితులను విచారణకు పిలుస్తారు. ఈ కేసులో మాత్రం హైదరాబాద్‌ కు సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రమేష్‌ (భద్రతా కారణాల రీత్యా ఫిర్యాదుదారుడి పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తిని ‘పోలీస్‌ బాస్‌’ ఆదేశాల మేరకు పిర్యాదు లేకుండానే సి.సి. పుటేజుల సాక్షిగా పోలీస్‌ మార్క్‌ ‘లిప్టింగ్‌’ చేశారు. నాటి బస్‌ టికెట్ల నకళ్ళను కూడా ‘ఆదాబ్‌’ సంపాదించింది. తాపీగా ఆ మరుసటి రోజున పిర్యాదు స్వీకరణ, అనంతరం సంబంధిత పోలీసులకు ట్రాన్స్‌ పోర్టు ఇచ్చినట్లు రికార్డులలో ఎక్కించారు. మరి 2014, సెప్టెంబరు 19వ తేదిన వీరికి ప్రయాణ అనుమతి ఇస్తే… సెప్టెంబరు18న అదే పోలీసులు బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుని ఆఫీసు పరిసర ప్రాంతాలలోని సి.సి.పుటేజులలో పోలీసులు చేసిన హంగామాను ‘ఆదాబ్‌’ సంపాదించింది. మరో 24 గంటల ‘పోలీసు మార్కు విచారణ’ జరిగింది. వైద్య పరీక్షల అనంతరం తొలి అరెస్టు చూపారు. ‘అసలు ఉద్దేశ్యం’ నెరవేరక పోవడంతో రకరకాల సంప్రదింపులు తొమ్మిది రోజుల పాటు జరిగాయి. ఎక్కడ బాధితుడు రాజీ పడలేదు. దీంతో ‘బాస్‌’ ప్రాపకం కోసం మళ్ళీ ‘ఖాకీ మెదళ్ళు’ తమ ఆలోచనలకు పదును పెట్టాయి. పొలిటికల్‌ పవర్‌, పోలీసులు కలసి ఏంచేసినా అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది. అదే అవకాశంగా మళ్లీ అదే కేసు, అదే ఎఫ్‌.ఐ.ఆర్‌, అదే నేరంపై, అవే సెక్షన్లు… ఎంచక్కా మరోసారి అరెస్టు కార్యక్రమం కానిచ్చారు. ఈ సందర్భంగా పోలీసు కస్టడీలో రికార్డుల ప్రకారం ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఒకసారి చెప్పారు. మరోసారి నిందితుడే తానే స్వయంగా వచ్చి లొంగిపోయినట్లు రికార్డుల పరంగా పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాలు బేఖాతరు:

బాధితుడు రమేష్‌ అన్ని ఆధారాలతో జిల్లా న్యాయస్థానం ముందుంచడంతో ప్రైవేటు కంప్లైంట్‌ రూపంలో పోలీస్టేషన్‌ కు చేరింది. ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్‌ అనంతరం అభియోగాలు ఎదుర్కొంటున్న ఉద్యోగి కన్న పైస్థాయి అధికారికి విచారణ బాద్యతలు అప్పగించాలి. ఇక్కడ ఎస్‌ఐ స్థాయి ఉద్యోగికి ఆ పని అప్పగించారు. ఒక ఎస్‌ఐ తన కన్నా నాలుగు అంచెల పైస్థాయి అధికారిపై విచారణ చేయగలడా..? దీంతో ఆడియో, వీడియో, డాక్యుమెంటరీ ఆధారాలను అన్నీ పక్కన పెట్టి ‘కేసు క్లోజ్‌’ చేశారు.

అధికారులు ఎంతగా తెగించారంటే…. బాధితుడు న్యాయస్థానంలో న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేదు. అయినా ‘బాధితుడి తరఫున న్యాయవాది ఈయనే’ అంటూ ఓ న్యాయవాదిని చూపారు.

హైకోర్టులో..:

బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై న్యాయవ్యవస్థ ద్వారా పోరాటం చేయసాగాడు. కింద కోర్టులో జరిగిన అన్యాయంపై హైకోర్టులో ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు చట్టపరంగా జిల్లా న్యాయధికారులపై ముందుకు సాగండని చెప్పారు. మరోవైపు నేరుగా హైకోర్టులో వేసిన కేసూలో మరో ఫలితం వచ్చింది. దీనిపైన బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండో అంచె ఫలితం కోసం ఒకవైపు న్యాయపోరాటం చేస్తూ… మరోవైపు రాష్ట్రపతికి ఆధారాలతో కూడిన ఫిర్యాదు అందింది. దీంతో ఆ ఫిర్యాదు కేంద్ర¬ంశాఖకు, అక్కడి నుంచి కేంద్ర విజిలెన్స్‌ విభాగానికి అందింది.

ఃనీలీ:

పేరు గోప్యం.. ఎందుకంటే..

అతను పెద్దగా చదువుకోలేదు. ఆయనకు ఉన్న ఏకైక అర్హత బడా రాజకీయ వేత్తలతో వెన్నంటి ఉండటం. అంతే నాటి పెద్దాయన దర్శనం కోసం ఈ చిన్న దొరగారి దగ్గర సారిగల పడి మరీ అధికారులు ప్రాపకం పొందేవారు. మరి అలాంటి సారుగారికి సమస్య వచ్చింది. ఆ సమస్యను భుజానికెత్తుకొని మోసారు సదరు పెద్దలు. ఈ ఇతివృత్తంలో సదరు ఐపిఎస్‌ అధికారి సారథ్యంలో ఏకంగా ఒకే కేసులో రెండుసార్లు అరెస్టు చేశారు. న్యాయం చేయాల్సిన అధికారులు అధికార దుర్వినియోగం చేసి తమ ఇష్టానుసారంగా వ్యవహరించారు. ”సుపారీ తీసుకుని మనషులను అపహరించే కిరాయి వికృతులకు… అధికారం అడ్డుగా పెట్టుకొని చేసే ఈ ‘లైసెన్స్‌ ప్రజా జీతగాళ్ళ’కు తేడా ఏముంది.?” ఈ కథనం పోలీసుశాఖకు వ్యతిరేకం కాదు. ఆ ముసుగులో జరుగుతున్న ‘అనైతిక దౌర్భాగ్యుల పాపాల బతుకు’ ఎలా ఉందో తెలియ చెపుతున్నాం. సాధారణంగా ఒక ఎస్‌ఐ స్థాయి ఉద్యోగిపై ఆరోపణలు వస్తేనే పత్రికలు వార్తలు రాయడానికి అనేక వత్తిళ్ళు ఉంటాయి. అలాంటిది సిఐ, ఏసిపి, అడిషనల్‌ ఏసిపి, డిసిపి, ఆ తర్వాత డిఐజి.. అంటే వచ్చే సంఘటనలను ఎదుర్కోవటానికి ఈ కలం బెదరదు. ఎన్నో బెదిరింపులు ‘ఆదాబ్‌ బృందం’కు వస్తున్నా… భయపడేది లేదు. నిజాలను నిర్భయంగా చెప్పే విషయంలో వెనకడుగు వేసేది లేదు. ఎన్నో ఆడియో, వీడియో, డాక్యుమెంటరీ ఆధారాలు సంపాదించినా… ఇది ‘కుటుంబ సమస్య’ కావడంతో ‘మానవీయకోణంలో ‘ఆదాబ్‌’ ఈ కథనం అందిస్తుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ ఉద్దండ పిండాలే. భద్రతా కారణాల దృష్ట్యా బాధితుని పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచడం జరిగింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close