కేంద్ర భద్రతా దళాలల్లో..

0

మహిళలకు 15శాతం

  • కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి8(ఆర్‌ఎన్‌ఎ) : సైనిక దళాలలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కిరణ్‌రిజిజు పైవిధంగా సమాధానమిచ్చారు. పార్లమెంటు కమిటీ సిఫార్సుల మేరకు మహిళా సాధికారతపై ఆరవనివేదికలో ఆయన మాట్లాడుతూ అన్ని సైనిక విభాగాలలోనూ మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌లలో మహిళల ప్రాతినిధ్యం 15శాతం కాగా, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలలో కేవలం ఐదుశాతంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. కాగా, జనవరి 5, 2016న సీఆర్‌పీఎఫ్‌, సీఐఎఫ్‌లలో కానిస్టేబుల్‌ స్థాయిలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ వంటి సరిహద్దు దళాల కానిస్టేబుల్‌ స్థాయిలో 14 నుండి 15శాతం పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. దశల వారీగా చేపడుతున్నట్లు రిజిజు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here