Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

జమ్మూకాశ్మీర్‌ తాజా పరిస్థితులపై కేంద్రం సమీక్ష

ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొన్న అజిత్‌ ధోవల్‌

హాజరైన ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా

ఇతర సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్లు

పరిస్థితులను ఆరా తీసిన ¬ంమంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ

జమ్మూకశ్మీర్‌లోని భద్రతా వ్యవహారాలపై అమిత్‌షా సమీక్షించారు. అక్కడ 370 రద్దు తరవాత ప్రస్తుత పరిస్థులతతో పాటు మరికొన్ని కీలకాంశాలను చర్చించడానికి కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో పాటు ఐబీ చీఫ్‌, కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఇంటర్నెట్‌, ఫోన్‌ సేవలను పునరుద్ధరించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబాతో పాటు ఇతర సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్లు కూడా సమావేశానికి హాజరయ్యారు. కశ్మీర్‌ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ¬దా రద్దు అయ్యింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా కశ్మీర్‌లోనే దోవల్‌ మకాం వేసి తాజా పరిస్తితులను అంచనా వేశారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడానికి అజిత్‌ దోవల్‌ 11 రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి క్షేత్రస్థాయి విషయాలపై దోవల్‌ ¬ంమంత్రి షాకు ఓ రిపోర్టును సమర్పించినట్లు సమాచారం. దీంతో తదుపరి చర్యలపై అమిత్‌ షా ఈ సమవేశంలో చర్చించి ఉంటారని తెలుస్తోంది.

370 రద్దు ముమ్మాటికీ తప్పే: ఆజాద్‌

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్రం రద్దు చేయడాన్ని సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మరోసారి తప్పుపట్టారు. ఆ రాష్ట్రంలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని, దానినిబట్టే ప్రభుత్వ నిర్ణయం తప్పని రుజువైందని ఆయన అన్నారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, 370 అధికరణ రద్దుకు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతలను వెంటనే విడుదలచేయాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ఆజాద్‌ డిమాండ్‌ చేశారు.

షీలా రషీద్‌ సంచలన వ్యాఖ్యలు

జమ్మూ కశ్మీర్‌లో తాజా పరిస్థితిపై జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేత షీలా రషీద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో నిత్యవసరాలు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని ఆమె ట్వీట్‌ చేశారు. స్థానిక పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని, మిలిటరీ బలగాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇళ్లల్లోకి ఆర్మీ జవానులు చొరబడి యువకుల్ని అకారణంగా తీసుకెళ్తున్నారని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితిపై పది అంశాలతో ట్వీట్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో మీడియా ప్రసారాలు నిలిపివేశారు. గ్యాస్‌ స్టేషన్లు అన్నీ మూసివేశారు. మందుల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది. సమాచార వ్యవస్థ పూర్తిగా స్థంబించిపోయింది. ఎలాంటి సమాచారం స్థానికులకు చేరడం లేదు. డీటీహెచ్‌ రీచార్జి చేసుకునే వెసులుబాటు లేదు. అతికొద్ది మందికి మాత్రమే టీవీ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయన్నరు. జమ్మూ కశ్మీర్‌ పోలీసులకు శాంతిభద్రతలపై ఎలాంటి అధికారాలు లేవు. అంతా పారామిలిటరీ దళాల చేతిలో ఉంది. సీఆర్‌పీఎఫ్‌ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఒక స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ను బదిలీ చేశారు. ఎస్‌హెచ్‌ఓలు వారి లాఠీలు మోస్తున్నారు. సర్వీస్‌ రివాల్వర్లను వారు కన్నెత్తి చూడడం లేదు. పారామిలిటరీ బలగాలు రాత్రి సమయాల్లో ఇళ్లల్లోకి ప్రవేశించి యువకుల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ఇళ్లల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న రేషన్‌ సరుకుల్ని చెల్లాచెదురు చేస్తున్నారు. షోఫియన్‌లో నలుగురు యువకుల్ని ఆర్మీ క్యాంప్‌లోకి పిలిచి విచారించారని తెలిపారు. ఒక మైక్‌ వారి దగ్గర పెట్టి వారి అరుపుల్ని ఆ ప్రాంతంలోని వారికి వినిపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఇలాంటి భయానక వాతావరణం జమ్మూ కశ్మీర్‌లో ఉందని షీలా రషీద్‌ ట్వీట్‌ చేశారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close