చేతిలో సెల్లు… ఓటుకు చెల్లు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

మొబైల్‌ లేకుండా ఉండలేకపోతున్నారు.. జీవితంలో ఒక భాగం కాదు, నేడు మొబైలే జీవితంగా మారిపోయింది. ఇరవై నాలుగు గంటలు ఫోన్‌తో గడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. ఎన్నికల సంఘం, స్వచ్చంద సంస్థలు అందరూ ఓటెయ్యాలి.. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి అని ఎంత చెప్పినా చదువుకున్న నగరంలోనే పోలింగ్‌శాతం సగానికి పడిపోయింది. అందుకు కారణాలు ఓటు మనం వెయ్యకుంటే ఏమి కాదు అనుకునే వారు ఐతే, మరీ పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి మొబైల్‌ అనుమతి లేదని చెప్పగానే మాకు ఓటు వద్దు.. మొబైల్‌ ముద్దు అని పోలింగ్‌ కేంద్రాల నుంచి వెళ్లిపోయిన యువతే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం… అందరూ ఓటేయ్యాలి.. మనం ఓటువేస్తేనే నాయకులను ప్రశ్నించవచ్చు. రాష్ట్ర అభివృద్దిలో మనము భాగస్వామ్యులం కావచ్చు. గ్రామాల్లో చదువుకొని వారే వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు కోసం బారులు తీరుతారు. అలాంటిది రాష్ట్ర రాజధానిలో ఉంటూ పెద్ద పెద్ద చదువులు చదివిన యువత ఓటు హక్కుకు దూరంగా ఉండద్దని ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల సంఘం ఎంత అవగాహన కల్పించినా మొబైల్‌ జీవితంగా మారిపోయిన యువత జీవితాల్లో ఓటుకు కూడా దూరమయ్యారు. నేడు యువత అన్నం తినకుండా ఐనా ఉండగలరేమో కాని సెల్‌ఫోన్‌ లేనిదే నిమిషం కూడా ఉండలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొంది. సెల్‌ఫోన్‌కు రోజురోజుకు బానిసగా మారుతున్న యువత, మధ్యతరగతి ప్రజలు పోలింగ్‌ వేళ కూడా మొబైల్‌ పోన్లను వీడడం లేదు. ఎన్నికల కమిషన్‌ ముందు నుంచి ఓటరు వినియోగంపై పలు విధాలుగా, వివిధ అంశాలపై అవగాహన కల్పించింది. ఓటర్లు ఓటు వేస్తూ సెల్పీ దిగినా, సామాజిక మాధ్యమాల్లో పోటోలు పెట్టినా చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని తెలిపింది. ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లు, తమ సెల్‌పోన్లను తీసుకురావద్దని సూచించింది. ఐనా రాష్ట్రంలోని పలు నగరాలలో యువత పోలింగ్‌ కేంద్రాలకు తమ సెల్‌ఫోన్లతో వచ్చారు. ఎన్నికల అధికారులు ఫోన్‌ బయటనే పెట్టి వచ్చి ఓటు వేయాలని సూచించే సరికి అంత రిస్క్‌ తీసుకోలేమనుకుని చాలా మంది బయటి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఓటు వేయకున్నా ఫర్వాలేదు కాని మాకు మా మొబైల్‌ ముఖ్యమనే యువకులు పెరిగిపోయారు. ఓటు వేయకుండానే వెనుదిరిగిన యువతరం.. హైదరాబాద్‌ నగరంలో ఓటింగ్‌ తగ్గడానికి ప్రధాన కారణం యువకులే. చదువుకున్న ఉద్యోగాలేనని మళ్లీ తేలిపోయింది. చాలా మంది ఓటు కోసం వచ్చి ఫోన్‌ వల్ల వెనుదిరిగిన వారు ఎక్కువమంది ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపించింది. చాలా మంది సెలబ్రెటీలు ఓటు వేయడం తమ బాధ్యత అంటూ క్యూలో నిలబడి మరీ ఓటేశారు. యువకులు కూడా పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. యువత సెల్‌ఫోన్లతో పోలింగ్‌ కేంద్రాలకు రావడంతో ఎన్నికల అధికారులు సెల్‌ ఫోన్లతో రావద్దని సూచించడంతో వారంతా ఫోన్లు పక్కన పెట్టడమే, బయట పెట్టడమే చేయకుండా ఓటు వేయకుండానే వెనుదిరగడం కనిపించింది. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటును కేవలం సెల్‌ఫోన్‌ కారణంగానే చాలా మంది వెనక్కిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నికల కమిషన్‌ ఈ సారి కఠిన నిబంధనలు రూపొందించింది. పోలింగ్‌ బూతుల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించింది. సెల్పీలు తీసుకొవడాన్ని నేరంగా పరిగణించింది. అంతేకాకుండా తాగి ఓటేసినా శిక్షార్హులవుతారని నిబంధన విధించింది. ఓటు వేసేందుకు వచ్చిన వారు తాగి ఉన్నారనే అనుమానం వచ్చినా వారిని చెక్‌ చేయడానికి బ్రీత్‌ ఎన్‌లైజర్లతో సిద్దంగా ఉండాలని పోలీసులకు అదేశాలు జారీ చేసింది. పలు ఆంశాలపై మీడియా ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా యువకులకు, ప్రజలకు అవగాహన కల్పించినా ఈ నిబంధనలకు పెడచెవిన పెట్టారు. కొంతమంది ఓటర్లు తెలిసో, తెలియకో పోలింగ్‌ బూతులకు వచ్చినా, అక్కడ పోలింగ్‌ అధికారులు నిబంధనలు చెప్పడంతో ఓటు వేయకుండా వెనుదిరిగినా వారు లక్షల్లో ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here