Featuredరాజకీయ వార్తలు

రైతుల కోసం పోరాడితే కేసలా..?

  • టీఆర్‌ఎస్‌లో హరీష్‌కు కాలం చెల్లినట్లే
  • రాహుల్‌ వర్సెస్‌ మోడీగానే పార్లమెంట్‌ ఎన్నికలు
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌ రెడ్డిని గెలిపించాలి
  • కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి

సిద్ధిపేట, మార్చి2(ఆర్‌ఎన్‌ఎ) : రైతులకు అండగా నిలిచినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. 2015 సంవత్సరంలో రంగనాయక సాగర్‌ ముంపు బాధితులకు నష్ట పరిహారం కోసం చేపట్టిన దీక్షలో రేవంత్‌పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కేసులో శనివారం సిద్దిపేట కోర్టుకు హాజరయ్యారు. ఆయన.. అనంతరం సిద్దిపేటలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మినవాళ్లను నట్టేటముంచడం కేసీఆర్‌కు అలవాటేనన్నారు. 16మంది ఎంపీలుంటే ఏదో వెలగబెడతామంటున్నారని, ఇన్నాళ్లు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని రేవంత్‌ అన్నారు. కాళేశ్వరానికి జాతీయ ¬దా తెచ్చారా..? విభజన హామీలు సాధించారా అని రేవంత్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో హరీష్‌రావుకు కాలం చెల్లినట్లేనని రేవంత్‌రెడ్డి అన్నారు. నమ్మినవాళ్లను నట్టేటముంచడం కేసీఆర్‌కు అలవాటేనన్నారు. హరీశ్‌కు సిద్దిపేట ఈసారే ఆఖరని, మరోసారి టికెట్‌ రాదన్నారు. 16మంది ఎంపీలను గెలిపించండి.. దేశానికి తెలంగాణ సత్తా ఏమిటో చూద్దాం అంటూ కేసీఆర్‌ అంటున్నారని రేవంత్‌ విమర్శించారు. 16మంది ఎంపీలుంటే ఏదో వెలగబెడతామంటున్నారని, ఇన్నాళ్లు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ ¬దా తెచ్చారా..? విభజన హావిూలు సాధించారా.. అని రేవంత్‌ ప్రశ్నించారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలు రాహుల్‌ వర్సెస్‌ మోదీగానే కొనసాగుతాయని ఆయన అన్నారు. కేసీఆర్‌ తాసూపాము లాంటి వ్యక్తి అని, కేసీఆర్‌ ఏనాడైనా నిన్ను చంపుతాడు అని చెప్పిన హరీష్‌రావు వినలేదన్నారు. వ్యక్తులతో కేసీఆర్‌కు అవసరం తీరిన తర్వాత బొందపెడుతారని రేవంత్‌ అన్నారు. హరీష్‌ రావు విషయంలోనూ అదే జరిగిందన్నారు. హరీష్‌ రావును టీఆర్‌ఎస్‌లో బొంద్దపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావుకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేని రేవంత్‌ ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్‌ గెలుస్తుందని, రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని రేవంత్‌ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని రేవంత్‌ గుర్తు చేశారు. 30ఏళ్ల తర్వాత మళ్లీ గాంధీ కుటుంబాన్ని ప్రధానిని చేయడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక తనపై నమోదైన కేసు గురించి మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. నా సొంత ప్రయజనాల కోసం సిద్దిపేటలో కేసు నమోదు కాలేదని, పేద ప్రజల భూములు అక్రమంగా తీసుకుంటే రైతులకు అండగా నిలుస్తే కేసు నమోదు చేశారన్నారు. రంగనాయక సాగర్‌ భూ నిర్వాసితులకు రైతులకు అన్యాయం జరిగిందని ఆదేవన వ్యక్తం చేసిన ఆయన.. రైతులకు అండగా నిలుస్తే కేసీఆర్‌, హరీష్‌ రావులు అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలంటే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని.. పేద ప్రజల సమస్యలు శాసనమండలో మాట్లాడాలి అంటే జీవన్‌ రెడ్డిని గెలిపించాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close