Featuredస్టేట్ న్యూస్

భరోసా కల్పించని భవిత కేంద్రాలు.. దివ్యాంగులకు సైతం వదలని అవినీతి చీడ

జనార్దన్‌ రెడ్డి సారూ… దివ్యాంగుల పరిస్థితి చూడండి

భవిత కేంద్రానికి వచ్చేందుకు రవాణా సౌకర్యార్థం ప్రతి విద్యార్థికీ నెలకు రూ.350, నార్మల్‌ పాఠశాలలు చదువుతున్న దివ్యాంగ విద్యార్థి ఎస్కార్ట్‌ కు రూ. 350 మంజూరు చేయాలి, దీంతో పాటు ఏడాదికి రూ. 2000 చొప్పున స్టైఫండ్‌ అందించాలి. పిల్లలకు మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇప్పించి ప్రభుత్వం పంపిణీ చేసే వికలాంగుల పింఛను అందేలా భవిత సిబ్బంది చూడాలి, ట్రైసైకిళ్ళు, వీల్‌ చైర్‌, వినికిడి యంత్రాలు, తోపుడు బండ్లు, సౌకర్యాలు కల్పించాలి కానీ రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి, కోఆర్డినేటర్‌లు మిలాకత్‌ అయ్యి దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిన హైదరాబాద్‌ జిల్లాలో భవిత కేంద్రాల పరిస్థితి గోరాతి గోరంగా ఉండడం, రక్షించే వారే భక్షించినట్లు దివ్యాంగుల సంక్షేమం చూడవలసిన బాధ్యతగల అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం దివ్యాంగులకు చెందిన సొమ్మును మింగేస్తూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న వైనం..

వైద్యశిబిరాలు లేవు…నిలిచిన ఉపకరణాలు

ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలూ ఇవ్వని పరిస్థితి

భవిత కేంద్రాల్లో తగ్గుతున్న దివ్యాంగులు

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు భరోసా కల్పించి భవితా కేంద్రాలను ఏర్పాటు చేయగా. అధికారుల నిర్లక్ష్యంతో భవిత సెంటర్లలో భరోసా కరువ య్యింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిత కేంద్రాల కొరకు సరిపోయేంత నిధులను మంజూరు చేసి దివ్యాంగ విద్యార్థులకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటుచేసిన భవిత కేంద్రాలను అధికారులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం దివ్యాంగులను సైతం వదలకుండా అవినీతికి పాల్ప డడం బాధాకరం. హైదరాబాద్‌ జిల్లాలో 24 భవిత కేంద్రాలు మండలానికి ఒకటి చొప్పున ప్రారంభిం చడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో 21 భవిత కేంద్రాలు కొనసాగుతున్నాయి.10 కేంద్రాలు సమగ్ర శిక్ష నిధుల ద్వారా ఏర్పాటుచేసిన సొంత భవనాలలో కొనసాగుతుండగా మిగతా కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిత కేంద్రాలను సరిపోయేంత నిధులను కేటాయించిన, నిధులు అందకపోవడంతో రెండేళ్లుగా కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి అని అధికా రులు తెలపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

హైదరాబాద్‌ జిల్లాకు సుమారు 40 లక్షల రూపాయలు భవిత కేంద్రాలకు ప్రభుత్వం సంవత్సరానికి కి నిధులను కేటాయించడం జరుగుతుంది. బుద్ధిమాం ద్యం, అంగవైకల్యం కలిగి ఉండి సొంతంగా పనులు చేసుకోలేని దివ్యాంగ పిల్లలను గుర్తించి వారిని భవిత కేంద్రాలను తీసుకొచ్చి, విద్యాబుద్ధులు నేర్పుతూ మాట్లాడేది అర్థం చేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. చివరికి సాధారణ విద్యార్థులుగా మార్చాలి. కానీ సమగ్ర శిక్ష అడిషనల్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారులు సౌకర్యాలు కల్పించకపోవడంతో భవిత కేంద్రాలకు దివ్యాం గులు రావడం తగ్గుతుంది. ఒక్కో కేంద్రంలో పదిమంది దివ్యాంగ పిల్లలకు ఒక్క ఇంక్లిస్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ టీచర్‌ ను నియమించాలి. వీరంతా వారి మండలాల పరిధిలో తిరిగి సరిగా మాటలు రాని బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతోపాటు అంగవైకల్యం కలిగిన వారిని గుర్తించాలి. వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకు రప్పించాల్సి బాధ్యత ఉంది. మలక్‌ పేట్‌ లోని భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష (సర్వ శిక్ష అభియాన్‌) లక్షల రూపాయలు వెచ్చించి సొంత భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కానీ గత నాలుగు సంవత్సరాల నుండి భవిత కేంద్రంలో బాత్రూం లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు భవిత సెంటర్‌ లో ఉంటారు. వారికి బాత్రూం లేకపోవడంతో ఎంత ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు సమగ్ర శిక్ష అధికారుల దష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. భవిత కేంద్రా లకు వచ్చే పిల్లలకు నెలకు రూ.350 ట్రాన్స్‌పోర్టు చార్జీలు, నార్మల్‌ పాఠశాలలో చదువుతున్న ఎస్కార్ట్‌ చార్జీలు రూ.350 ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరంనుంచి ట్రాన్స్‌పోర్టు చార్జీలు విడుదల కాలేదు. అసలే దివ్యాంగత్వం కారణంగా ఆర్థిక భారంతో బాధపడుతున్న కుటుంబాలు పిల్లలను భవిత కేంద్రా లకు పంపించేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పిల్లలకు వీల్‌చైర్స్‌, ట్క్రె సైకిళ్లు, వినికిడి యంత్రాలతో పాటు చంక కర్రలు, మానసిక బుద్ధి మాంద్యత కిట్లు, బ్రెయిలీ బుక్స్‌, తదితరాలు కూడా అందుబాటులో ఉంచాలి. కానీ 2018 నుండి ఇప్పటివరకు హైదరాబాద్‌ జిల్లాలో పరిస్థితి లేకపోవడంతో సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరు స్పష్టంగా అర్థమవుతుంది.

ఆగిన వైద్యశిబిరాలు : భవిత కేంద్రాల్లో చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం మండల స్థాయిలో ప్రతి డిసెంబర్‌లో ఆలీమ్కో ఆధ్వర్యంలో వైద్యశిబిరాలను నిర్వహించాలి. వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వ హించి ఎలాంటి ఉపకరణాలు అవసరమనేది గుర్తించాలి. గ్రహణ మొర్రి వంటి వారికి కూడా శస్త్రచికిత్సలకు ప్రణాళికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తారు. అదే సంవత్సరం నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో పరికరాలు అందించడంతోపాటు శస్త్ర చికిత్సలు చేయించాలి. కానీ ఇంతవరకు పరికరాలు అందలేదు. ఈ సంవత్సరం జనవరిలో అసలు పరీక్షలే నిర్వహించలేదు.

అంటే రెండేళ్లుగా వైద్యశిబిరాలు లేవన్నమాట. ఇంత నిర్లక్ష్యంగా సమగ్ర శిక్ష అధికా రుల పర్యవేక్షణలో నగరంలోని భవిత కేంద్రాలు కొన సాగుతున్నాయి, రక్షకులే భక్షకులుగా మారడం దురదష్టకరం.

ప్రతి సోమవారం ఫిజియోథెరపీ చేయాలి.. వారంలో ప్రతి సోమవారం పిల్లలకు ఫిజియోథెరపిస్ట్‌తో ఫిజియోథెరపీ చేయాలి. పిల్లలు ఎవరైనా పాఠశాలకు రాలేని వారు ఉంటే వారి ఇళ్లకే వెళ్లి చేయిం చాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఎలాంటి నిధులూ విడుదల కాకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే పిల్లలు పాఠశాలకు రాలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై ఉంటారో అలాంటి పిల్లల ఇంటికి వెళ్లి ఒక గంటన్నరసేపు బోధించాల్సి ఉంది. ఇలాంటి విషయంలో కూడా పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించడం లేదు.

దొంగ లెక్కలు చూపించి డబ్బులు కాజేస్తున్న అధికారులు.. భవిత కేంద్రాలకు నిధులు అందని కార ణంగా కేంద్రాలలో సౌకర్యాలు కల్పించే లేక పోతున్నామని అధికారులు అంటున్నారు. కానీ వాస్త వాలు వేరుగా ఉన్నాయి ప్రభుత్వం కోట్ల రూపాయలు దివ్యాంగుల సంక్షేమం కొరకు వెచ్చించిన డబ్బులను సమగ్ర శిక్షలోని అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, స్టేట్‌ కోఆర్డినేటర్‌, జిల్లా కోఆర్డినేటర్‌ అందరూ కుమ్ముక్కై దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించిన నిధులను మింగేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర, జిల్లా భవిత కేంద్రాల కోఆర్డినేటర్‌ లకు ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధి సంప్ర దించి భవిత కేంద్రాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలు, హైదరాబాద్‌ జిల్లా భవిత కేంద్రా లకు కేటాయించిన నిధులను, వారు ఖర్చు చేసిన వివరాలు కోరగా పొంతనలేని సమాధానాలు చెప్తూ, సమాచారం ఇవ్వకపోవడంతో అధికారులు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు బలపడు తున్నాయి. నగరంలోని భవిత కేంద్రాన్ని ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధి సందర్శనకు వెళ్లగా 10మంది ఒక కేం ద్రంలో, నలుగురు కేంద్రంలో ఒక కేంద్రానికి తాళమే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.వాస్తవంగా అక్కడ 21 మంది పిల్లలు ఉండాలి. కానీ ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వని కారణంగా పిల్లల సంఖ్య తగ్గిపో తుందని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం మిడ్‌ డే మీల్స్‌ ద్వారా అందుతున్నట్లు సమాచారం. కొం దరు తల్లిదండ్రులు తమ పిల్లలను భవిత కేంద్రంలో తోలిపో తుండగా, మరికొందరు ఆటోలో సొంత డబ్బులతో పంపిస్తున్నారని, కొందరు పంపించడం లేదని తెలిసింది. ప్రభుత్వం ఇకనైనా అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, భవిత కేంద్రాలలో జరిగిన అవినీతిపై 2014 నుండి సమగ్ర విచారణ చేపట్టి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల సంక్షేమసంఘ నాయకులు కోరుతున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close