Featuredస్టేట్ న్యూస్

విరమించమని చెప్పలేం..

  • హైకోర్టుకు రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీర్మానం
  • ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని ప్రభుత్వ వాదన
  • సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని వెల్లడి
  • ఆర్టీసీ సమ్మెపై విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం కేసును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీర్మానాన్ని హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్టీసీని పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌గా ప్రకటించినందున.. ఎస్మా పరిధిలోకి వస్తుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాధించారు. పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌లన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు పేర్కొంది. ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సమ్మె చట్టవిరుద్ధమని మరోసారి హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సమ్మెను చట్టవిరుద్ధమని చెప్పలేమని హైకోర్టు తెలిపింది.ఇకపోతే ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం వాదనలను కొనసాగించిన హైకోర్టు.. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది కృష్ణయ్య హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆర్టీసీని పబ్లిక్‌ యూటిలిటీ సర్వీస్‌గా ప్రకటించినందున అత్యవసర సేవల (ఎస్మా) పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య పేర్కొన్నారు. కాబట్టి ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే, అత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. ప్రజాప్రయోజనాల పేరిట ఆధారాలు లేకుండా విచిత్రమైన ఇష్యూస్‌ను కోర్టు ముందుకు తీసుకొస్తే.. రిలీఫ్‌ ఇవ్వలేమని, ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అనేకసార్లు తాము కోరామని గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇలాగే చేయాలని ఆదేశించలేమని పేర్కొన్న హైకోర్టు.. విచారణను మంగళవారం వాయిదా వేసింది. ఇక, రాష్ట్రంలోని పలు రూట్లను ప్రవైటీకరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. కాగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 38వ రోజుకు చేరింది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని కోర్టు వివరించింది. విధుల్లో చేరండి..లేకపోతే లేదని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించింది. చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని బలవంత పెట్టే అధికారం మాకెలా ఉంటుందని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులు రేపటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close