మనోనిబ్బరంతో క్యాన్సర్‌పై విజయం: సినీనటి గౌతమి 

0

(అమరావతి) :క్యాన్సర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సినీనటి గౌతమి అన్నారు. అశోక్‌నగర్‌ రూట్స్ ఉచిత క్యాన్సర్‌ సంరక్షణా కేంద్రంలో రోగులను పరామర్శించారు. అనంతరం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చేసుకుని నయం చేసుకోవచ్చన్నారు. లైఫ్‌ అగైన్‌ ఫౌండేషన్‌ సంస్థ ద్వారా అనేక మందికి ఈ వ్యాధిపై దేశ, విదేశాల్లో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మనోనిబ్బరంతో క్యాన్సర్‌ను జయించవచ్చన్నారు. రూట్స్ ఫౌండేషన్‌ సంస్థ  కార్యక్రమాలు అభినందనీయమన్నారు. రూట్సు ఫౌండేషన్‌  ఛైర్మన్‌ పోలవరపు విజయభాస్కర్‌ మాట్లాడుతూ గత 10ఏళ్లుగా అక్టోబరు నెలంతా బ్రెస్టు క్యాన్సర్‌పై అవగాహన సదస్సులు చేపట్టడంతోపాటు వారికి ఉచితంగా పాప్‌స్మియర్‌, మెమోగ్రాం టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఈఏడాది 1800 అడుగుల పెయింటింగ్‌ను 300 మంది మహిళలచే వేయించి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం కోసం ఆదివారం ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ మాట్లాడారు. సంరక్షణా కేంద్రం ఛైర్మన్‌ అన్నే శివనాగేశ్వరరావు, నాట్సు ప్రతినిధి చందు, లైఫ్‌ అగైన్‌ ప్రతినిధి హరిత తదితర సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here