Featuredస్టేట్ న్యూస్

నిర్మాణ అనుమతులను రద్దు చేస్తాం : కమిషనర్‌

పీర్జాదిగూడ మున్సిపాలిటీలో రహదారిపై నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను మందలించిన మున్సిపల్‌ కమిషనర్‌..

మేడిపల్లి (ఆదాబ్‌ హైదరాబాద్‌): లంచాల మోజులో పీర్జాదిగూడ మున్సిపాలిటీ, రహదారి పైనే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు. అనే శీర్షికతో ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రిక లో వచ్చిన వార్తకు స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ సదరు స్థలాన్ని పరిశీలించి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను మందలించారు. శనివారం ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన రహదారిని సందర్శించిన ఆయన వాస్తవ పరిస్థితులను పరిశీలిం చకుండా ఎల్‌. ఆర్‌. ఎస్‌. ఉన్నదనె కారణంతో ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం పట్ల విచారం వ్యక్తపరిచారు. మున్సిపాలిటీలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసే ముందు ఆ స్థలం పరిసరాలతో పాటు డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించాలని మున్సిపల్‌ కమిషనర్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు సూచించారు.చెంగిచెర్ల సమీపంలోని సాయి నగర్‌ లో రహదారి పైన ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన కథనాన్ని ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించడం తో దిగొచ్చిన మున్సిపల్‌ అధికారులు ఇంటి నిర్మాణ అనుమతులు రద్దు చేసే విష యాన్ని పరిశీలిస్తున్నామని హామీ ఇచ్చారని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధి జి సోమయ్య తెలిపారు.కాగా మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న అక్రమ లేఅవుట్లు, బోగస్‌ ఇంటి నిర్మాణ అనుమతుల పై ఆదాబ్‌ దినపత్రిక కార్యాలయానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.మున్సిపల్‌ అధికారుల అవినీతి, వ్యవహారాల్లో ప్రజల ఫిర్యాదులపై వరుస కథనాలను ప్రచురించేందుకు సిద్ధమవుతున్న దినపత్రికకు అందే విధంగా పూర్తి ఆధారాలతో ఫిర్యాదులను పంపవచ్చును.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close