Featuredరాజకీయ వార్తలు

‘చెత్త’గా బతకలేం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఆయన సౌమ్యుడు. ఎవ్వరికీ తలవంచడు. కన్నీళ్ళు కనిపిస్తే తల్లడిల్లుతాడు. మోముపై చిరునవ్వు ఆయుధం. చావు ఎదురుగా వచ్చినా.. ప్రాణం తీసుకో… కానీ ముందు ప్రజల సమస్య పరిష్కారిం చాలని పోరాడి సాధించుకుంటాడు.. 33 ఏళ్ళు ఏ రంగూ మార్చకుండా.. ఒకే పార్టీలో.. కొనసాగు తూ.. నగరంలోని చెత్తపై పోరాడుతున్న సౌమ్యుడు. రాగాలు తీసే రోగాల నుంచి ప్రాణాలతో అల్లాడుతు న్న మేడ్చల్‌ ప్రజలు పార్టీలకతీతంగా ప్రేమించే కోంపెల్లి మోహన్‌ రెడ్డిగా చెప్పే ‘మోహనన్న’తో ఆదాబ్‌ హైదరాబాద్‌ ఇంటర్వ్యూ.

– మీస్థాయికి రాజకీయాలు అవసరమా..?

నేను గత 33 సంవత్సరాలుగా భాజపాతో ఉన్నాను. అదంటే నాకిష్టం. నిబద్దతతో ఉన్నా … ఉంటా…

– వ్యాపారాలు బాగానే విస్తరించాయి. అయినా మీరు గత పాతికేళ్ళుగా ఇక్కడి ప్రజలతో ఉన్నారు. ఎందుకు.?

ప్రభుత్వాలు వస్తున్నాయి. పోతున్నాయి. ఇక్కడ ప్రజలకున్న ప్రధాన సమస్య.. ఊహించని ఒళ్ళుదలరించే భయానకమైంది. అక్కడ ప్రజలు పడే బాధను చూసి నేనూ .. నా కుటుంబం ఇక్కడే ఉన్నా.. ఇప్పుడు నా లక్ష్యం, నా ధ్యేయం.. ఆ సమస్య తుది పరిష్కారమే.

– అంతటి గంభీరమైన సమస్య ఏమిటి..?

ఈ సమస్య కేవలం ఒక డబుల్‌ బెడ్‌ రూం, ఒక ఎకరం, ఓ వ్యక్తికో ఓ కుటుంబానికి, ఓ వీథికి, ఓ వార్డుకు, ఓ చిన్న ప్రాంతానికి సంబంధించినది కాదు. యావత్త్‌ భారతదేశం గర్వపడే 425 ఏళ్ళ చరిత్ర కలిగిన య హైద్రాబాద్‌ కు ముడిపడిన సమస్య. అందుకే నా పోరాటం.. ఆరాటం.

– వివరంగా చెప్పండి..?

హైదరాబాద్‌ మహానగరంలోని అతి పెద్ద డంప్యార్డ్‌ అంటే హైదరాబాద్‌ నగరంలోని చెత్త అంతా… మా నియోజకవర్గ పరిధిలోని జవహార్నగర్‌. అది 135 ఎకరాల విస్తీర్ణం. 14 మిలియన్‌ టన్నులకు పైగా ఘన వ్యర్థాలున్న డంప్యార్డ్‌ ప్రదేశం. ఇది దేశంలోని నాలుగు పెద్ద డంపింగ్‌ ప్రదేశం.

– జిహెచ్‌ఎంసీ ఏం చేస్తోంది..?

625 చ.కిలో విూటర్ల విస్తీర్ణం కలిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోని మొత్తం చెత్తను మా జవహార్నగర్‌ లోనే దశాబ్దాల నుండి వేస్తున్నారు. వేయి కోట్లు కావాలి.

– ఎంత కేటాయించారు..?

చెప్పుకోవడానికే రూ. 144 కోట్ల కేటాయించింది. సమస్య పరిష్కారానికి కావల్సింది కనీసం వేయి కోట్లు.

– 85% పనులు చేసినట్లు చెపుతోంది..?

అలా జరిగితే మా కంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు. కనీసం ఆదిశలో ప్రయత్నం జరగలేదు. అయినా ఈ ‘చెత్త’ మా ప్రాంతంలో ఎందుకు..? ఎక్కడికైనా తరలించి మా ప్రజల ప్రాణాలు కాపాడండి. చాలు.

– అంటే సమస్య విూరు చెప్పే స్థాయిలో ఉందా..?

20 లక్షలమంది దిక్కుతోచక ఇక్కడ నుంచి వెళ్ళలేక దీనంగా కాలం వెళ్ళతీస్తున్నారు.

– మరి ప్రభుత్వం చాలా చేస్తుందని చెపుతోంది..?

అవును.. ఒకశాతం పని చేస్తూ.. ఈ డంప్యార్డ్ను 150 మి.మిటర్ల మందంతో మట్టితో పూర్తిగా కప్పి వేసేందుకు 80 టిప్పర్లు, జెసీబీలను ఇప్పటి వరకు 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల మట్టిని క్యాపింగ్కు ఉపయోగిస్తున్నారు. అయితే మా సమస్య దీనితో తీరేది కాదు. ఆనేక రోగాలను తరతరాలుగా అందించే డంపింగ్‌ యార్డు మాకెందుకు.. మా దగ్గరే ఎందుకు.? ఇప్పటికే 2 లక్షల 80 వేలమంది దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారు. ఈ నగర చెత్త రోజుకు కనీసం ముగ్గురి ప్రాణాలను తీస్తోంది. ఏరోజు ఏ ఇంటి నుంచి చావు కబురు వస్తోందని భయం,

భయంగా బతుకుతున్నాం.

– వాతావరణ కలుష్యం..?

దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఇది ప్రధానమైంది. రాత్రి కాదుకానీ సాయంత్రం ఓసారి వచ్చి చూడండి. కనీసం పది నిమిషాలు ఉండలేరు. విూం గాలి పీల్చడం లేదు విషాన్ని పీలుస్తున్నాం. కనిపించని విషవాయువులతో సహజీవనం చేస్తున్నాం.

– టెర్రా కన్సల్టెంట్‌ లిమిటెడ్‌ గతంలో గల్ఫ్లోని కువాయిట్లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 10లక్షల మిలియన్‌ డంప్యార్డ్‌ క్యాపింగ్‌ పనులను పూర్తిచేసింది. కదా.. ఇక్కడ..?

అక్కడి పరిస్థితులు వేరు. మన పరిస్థితులు వేరు. అక్కడ 23 చోట్ల చెత్తను అంచెలంచెలుగా శుద్ది అనంతరం డంపింగ్‌ కు వస్తుంది. అంతకు 400 రేట్లు కలిగిన హైదరాబాద్‌ నగరంలోని చెత్తను ఎలాంటి శుద్దీకరణ లేకుండా మా ప్రాంతంలో పడేసి చావును రోజూ చూసుకోండని ప్రభుత్వం చెపుతోంది.

– ధర్నాలు చేశారు.. కేసులం వేశారు.. ఫలితం..?

చేయాల్సిన వన్నీ చేస్తున్నాం. కోర్టులకు వెళ్ళాం. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కు వెళ్ళాం. ఎక్కాల్సిన మెట్లన్నీ ఎక్కాం. తొక్కాల్సిన గడపలు అన్నీ తొక్కాం.

– మీరు ఏం కోరుతున్నారు..?

ఈ చెత్త మాకొద్దు. ఎక్కడికైనా వేరే ప్రాంతానికి పంపండి. మాకు ఇక మిగిలింది ప్రజాక్షేత్రంలో పోరాటమే. అందుకే బరిలోకి దిగా. ఇదే చివరి ప్రయత్నం. మాదే విజయం. మా విజయమే ఈ సుధీర్ఘ సమస్యకు పరిష్కారం.

సమస్య పరిష్కారం కావాలని కోరుతూ అదాబ్‌ హైదరాబాద్‌ సెలవు తీసుకుంది

సహకారం: గుజ్జుక పరుశురామ్‌

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close