ప్రశాంతంగా మూడవ విడత..

0
  • 16 రాష్ట్రాల్లోని 116 స్థానాలకు పోలింగ్‌
  • పలు ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంలు
  • పశ్చిమబెంగాల్‌లో బూత్‌ వద్ద బాంబు దాడి
  • ఓటుహక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): పశ్చిమ్‌ బంగ, యూపీ మినహా మిగతా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 115 నియోజవకర్గాల్లో పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 51.15శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఈసీఐ ప్రకటించింది. సాయంత్రం 5గంటల సమయానికి క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 1640 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 18.85 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇందుకోసం మొత్తం 117 నియోజకవర్గాల్లో 2.10లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రతా బలగాలను మోహరించారు. ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహించిన ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నాయని నిర్థారించుకున్నాకే ఓటింగ్‌ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటర్లతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు ప్రశాంతంగా సాగింది.. మంగళవారం మొత్తం 14 రాష్టాల్రు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్‌(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్‌(7), ఒడిశా(6), బిహార్‌ (5), బెంగాల్‌(5), గోవా(2), దాద్రనగర్‌ హవేలీ, డామన్‌డయ్యూ, త్రిపురలో చెరో స్థానానికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. వయనాడ్‌లో ఏర్పాటుచేసిన ఓ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి తుషార్‌ వెల్లప్పల్లి రీపోలింగ్‌కు డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. రాహుల్‌ గాంధీ ఇక్కడి నుంచే పోటీచేయడంతో అందరి దృష్టి వయనాడ్‌పై పడింది. ఇదిలాఉంటే మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కేరళలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కన్నూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మయ్యిల్‌ కందక్కయ్‌లోని పోలింగ్‌ బూత్‌లో వీవీప్యాట్‌లో ఓ పాము దర్శనమిచ్చింది. దీంతో ఎన్నికల సిబ్బంది, ఓటర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఓ సందర్భంలో పోలింగ్‌కు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. అనంతరం పామును వీవీప్యాట్‌ నుంచి తీసి అక్కడి నుంచి మరోచోట వదిలేసి పోలింగ్‌ను కొనసాగించారు. అయితే వీవీప్యాట్‌లోకి పాము ఎలా దూరిందన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here