సినిమా వార్తలు

వరుస సినిమాలతో బిజీగా బన్నీ!

‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన సినిమా ఏదీ ఇప్పటివరకు విడుదల కాలేదు. ఆ సినిమా పరాజయం కారణంగా తర్వాతి సినిమా గురించి బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దర్శకుడు విక్రమ్‌ కుమార్‌తో స్కిప్టు గురించి చాలా రోజులు చర్చించి చివరికి తిరస్కరించాడు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్‌పై ఉంది. త్రివిక్రమ్‌ సినిమా మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కాగానే డైరెక్టర్‌ సుకుమార్‌ సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించబోతోంది. ఈ సినిమా షూటింగ్‌ యాభై శాతం పూర్తవగానే దిల్‌ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఐకాన్‌’ను స్టార్ట్‌ చేయనున్నాడు. ఆ సినిమా పూర్తవగానే కొత్త దర్శకుడితో చేయబోయే సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు. ఇప్పటివరకు ఖాళీగా గడిపిన బన్నీ ఒక్కసారిగా వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడన్నమాట.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close