అడవిలో.. పేలిన తూటా..

0

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భైరామ్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మరణించారు. అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. భైరామ్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో ఇంద్రావతి నది సవిూపంలో. మావోయిస్టుల కదలికలు ఎక్కువ. గురువారం ఉదయం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారం అందుకున్న ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు 10మంది మావోయిస్టులు మరణించారని బీజాపూర్‌ ఎస్పీ మోహిత్‌ గార్గ్‌ తెలిపారు. ఘటనా స్థలి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టుల మృతిని బీజాపూర్‌ ఎస్పీ మోహిత్‌ గార్గ్‌ అధికారికంగా ధ్రువీకరించారు. కాగా భైరాంగఢ్‌

పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందటంతో ఇంద్రావతి నది సవిూపంలోని అబూజ్‌మడ్‌ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపి 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని, చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here