బ్రిటానియా ఖావో – వరల్డ్‌ కప్‌ జావో

0

విజయవాడ : ప్రముఖ బ్రిటానియా కంపెనీ తాజాగా బ్రిటానియా ఖావో , వరల్డ్‌ కప్‌ జావో ప్రచారాన్ని ప్రారంభించింది. అదే విధంగా బ్రిటానియా తాజాగా బిగ్‌ బాస్కెట్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఫుడ్‌ అండ్‌ క్రికెట్‌ మజాను ఒకేసారి అందుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ ను ఏప్రిల్‌ – జూన్‌ మధ్యకాలాల్లో చేపడుతున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బిగ్‌ బాస్కెట్‌ సీఈఓ, సహవ్యవస్థాపకుడు హరిమీనన్‌ మాట్లాడుతూ ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు క్రికెట్‌ రెండూ ఒకేసారి ఆనందాన్ని మోసు కొచ్చాయి.ఈ నేపధ్యంలోనే బ్రిటానియా బిగ్‌ బాస్కెట్తో ఒప్పందం కుదుర్చుకుని ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపారు .బ్రిటానియా ఖావో , వరల్డ్‌ కపావో ప్రచారాన్ని బిగ్‌ బాస్కెట్తో ఒప్పందం కుదుర్చుకుని కొనసాగించడం ఆనందంగా ఉందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ మార్కెటింగ్‌ వీపీ అలి హర్రిస్‌ షెరె తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here