బ్రావో ఛాంపియన్‌ పాట

0

చెన్నై : చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఛాంపియన్‌ పాట కుర్రకారును ఎంతలా ఉర్రూతలూగించిందో మనందరికీ తెలిసిందే. అయితే, బ్రావో తాజాగా మరోసారి ఛాంపియన్‌ పాట విడుదల చేశాడు. అయితే ఈసారి అది క్రికెటర్ల మీద కాదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్ల పిల్లలపైన. ధోనీ ఛాంపియన్‌.. జీవా ఛాంపియన్‌.. అంటూ క్రికెటర్ల పేర్లు ఆ తర్వాత వాళ్ల పిల్లల పేర్లు వచ్చేలా పాటను రూపొందించాడు. బ్రావో పాడిన ఈ పాటను సీఎస్‌కే యాజమాన్యం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘అందర్లోనూ సంతోషం నింపుతున్న ఛాంపియన్‌’ అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడా వీడియో ట్విటర్‌లో వైరల్‌ అయింది. దీనిపై స్పందించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులు.. ‘మనం ఒక జట్టు మాత్రమే కాదు.. మనమంతా ఒకే కుటుంబం’ అని పేర్కొంటున్నారు. కొంతమందేమో సీఎస్‌కే అంటే టీమ్‌ కాదు.. అదో ఎమోషన్‌ అంటూ తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here