శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..

0

జైపూర్‌ : పాక్‌ పై దాడిచేసిన జవాన్లపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. మీ ధైర్య సాహసాలు, మెరుపుదాడి భరతజాతి గర్వపడుతోంది. సగర్వ భారతవని తలెత్తుకొని నిలబడుతోందని చెప్పారు. రాజస్థాన్‌లోని చిరులో మాజీ సైనిక ఉద్యోగుల సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. వీరులరా .. శెభాష్‌ పుల్వామా దాడికి ధీటుగా ప్రతి దాడి చేసిన వాయుసేన సైనికులను పొగడ్తలతో మంచెత్తారు. మీ చర్యతో ఇక దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు. తనకు దేశం కంటే మరేదీ ముఖ్యం కాదన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌ కు కనువిప్పు కలిగేలా మెరుపుదాడి చేసిన వీరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సభలో ఉద్వేగపూరితంగా ప్రసంగిం చారు. ఆ సమయంలో అక్కడున్న మాజీ సైనికులు కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మారుమోగింది. ఇక సేఫ్‌ .. ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్థాన్‌ వెన్నులో వణుకుతీసుకొచ్చామన్నారు. దీంతో భారత్‌ పై దాడి అంటేనే భయపడే పరిస్థితి అని వివరించారు. ఐఏఎఫ్‌ చేసిన దాడి మనందరికీ గర్వకారణంగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి భారతీయ పౌరుడు ఈ విజయాన్ని ఆస్వాదించాలని .. ఇవాళ సంబురాలు చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పుడు దేశం సురక్షితంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతీకార దాడి … పుల్వామా దాడికి ప్రతీకారంగా మంగళవారం ఉదయం తెల్లవారుజామున భారత వాయుసేన దాడికి దిగింది. పీవోకేలోని బాలాకోట్‌, చకోటి, ముజఫర్‌ నగర్‌ లో మిజార్‌ యుద్ధ విమానం, జెట్‌ విమానాలతో కలిసి జైషే మహ్మద్‌ శిబిరంపై దాడి చేసింది. మొత్త 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని భారత అధికారులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here