బోగీబీల్‌ వంతెనను..

0

ప్రారంభించిన ప్రధాని మోడీ

గౌహతి : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘బోగిబీల్‌ రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి పై ప్రధాని కొద్దిదూరం కాలినడక చేస్తూ ప్రజలకు అభివాదం చేశారు. 4.94 కిలోవిూటర్ల పొడువైన ఈ బ్రిడ్జిని బోగిబీల్‌ దగ్గర బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. ఇది రక్షణపరంగా భారత్‌కు ఎంతో వ్యూహాత్మకమైన ప్రాంతం. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇండియా, చైనా సరిహద్దు విషయంలో ఈ బ్రిడ్జి కీలకపాత్ర పోషించ నుంది. ఈ బ్రిడ్జికి 1997లోనే పునాది పడింది. ఆ ఏడాది జనవరి 22న అప్పటి ప్రధాని దేవెగౌడ శంకు స్థాపన చేశారు. ఆ తర్వాత 2002, ఏప్రిల్‌ 21న అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లకు అదే వాజ్‌పేయి జయంతి రోజున ఆ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించడం విశేషం. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3230 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేసినా.. బాగా ఆలస్యం కావడంతో ఆ మొత్తం రూ.5960 కోట్లకు పెరిగింది. ఇక గతంలో 4.31 కిలోవిూటర్లుగా ఉన్న ఈ బ్రిడ్జి పొడువును 4.94 కిలోవిూటర్లకు పొడిగించాలని నిర్ణయించారు. దాని ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం దాదాపు 30 లక్షల బస్తాల సిమెంట్‌ను వాడారు. ఇది దాదాపు 41ఒలంపిక్‌ స్విమ్మింగ్‌ పూల్ల నిర్మాణానికి సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్‌లో కోసం దాదాపు 19, 205 విూటర్ల స్టీల్‌ను వాడారు. ఈ ప్రాజెక్ట్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అంజా, చాంగ్‌లాంగ్‌, లోహిత్‌, లోయర్‌ దిబాంగ్‌ వాలీ, దిబాంగ్‌ వాలీ, తిరాప్‌ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. దాంతో పాటు అస్సాంలోని దిబ్రూఘర్‌, ధెమాజీ జిల్లాల ప్రజలు కూడా లాభపడనున్నారు. చైనా సరిహద్దు సవిూపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి భారత రక్షణ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధ ట్యాంక్‌ల కదలికకు, టైర్‌ జెట్ల ల్యాండింగ్‌లను తట్టుకునేవిధంగా చాలా బలంగా బోగిబీల్‌ బ్రిడ్జి నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here