Featuredస్టేట్ న్యూస్

అల్లావుద్దీన్‌ అద్భుతదీపంతో ఓట్ల కోసం బోడుప్పల్‌ నేతల వేట

  • రా చెరువు కట్టపై బహిరంగ మల మూత్ర విసర్జన చేస్తున్న వారిని చైతన్య పరుస్తున్న స్వచ్ఛంద సంస్థలు

మేడిపల్లి (ఆదాబ్‌ హైదరాబాద్‌): బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ను బహిరంగ మల మూత్ర నిషేధిత ప్రాంతంగా అధికారులు ఆ దిశగా ప్రజలను చైతన్యపరచడం లో విఫలమ వుతున్నారు. మున్సిపల్‌ పరిధిలో కూలీలు ఇతర రాష్ట్రాల ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో నేటికీ బహిరంగంగ మల మూత్ర విసర్జన నిరాటంకంగా కొనసాగడం చర్చనీయాం శంగా మారింది. రా చెరువు కట్టపై బహిరంగంగా మలమూత్ర విసర్జన చేస్తున్న వారిని పట్టుకున్న స్వచ్ఛంద సంస్థలు దాని వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ఇక ముందు ఇలా చేయకూడదని అవగా హన కల్పించడం విశేషం. స్వచ్ఛత పై జాతీయ స్థాయిలో బహుమతులు అందుకోవడం కోసం జిమ్మిక్కులు ప్రదర్శించిన అధికారులు వాస్తవంగా జాతీయస్థాయిలో బహుమతులు అందు కునెంత స్వచ్ఛంగా పరిస్థితులను కల్పించలేదనేది స్థానికుల వాదన. నేటికీ మున్సిపాలిటీలో పందులు విచ్చలవిడిగా సంచ రిస్తూ భయాందోళనలు సష్టిస్తున్నాయని డ్రైనేజీలు పొంగి పొర్లి కంపు కొడుతున్నాయని వారు తెలిపారు. మున్సిపల్‌ అధికారులు బహుమతుల కోసం కాకుండా మనసుపెట్టి విధులు నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములను చేసిన నాడే బోడుప్పల్‌ పరిశుభ్రంగా మారుతుందని మున్సిపల్‌ ప్రజలు ఆశాభావం వ్యక్తపరిచారు…

ప్రశాంత్‌, గాదె కషి భేష్‌.. బోడుప్పల్‌ మున్సిపల్‌ పరిధిలోని రా చెరువు కాలుష్య కాసారంగా మారి బోడుప్పల్‌ ప్రజల గుండెలపై రోగాలు నొప్పులతో తిష్ట వేయగా అడుగులో అడుగై గడపగ డపకు అంటూ సమస్యలు చెప్పండి పరిష్కరించే చేస్తా అని అల్లావుద్దీన్‌ అద్భుతదీపం పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్న ప్రజా ప్రతినిధి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఘట్కే సర్‌ జడ్పిటిసి సభ్యునిగా కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యునిగా రా చెరువు ముఖం చూడని నాయకుడు రానున్న మున్సిపల్‌ ఎన్ని కలలో ఓట్ల కోసం స్వచ్ఛంద సంస్థల, రా చెరువు శుద్ధి కార్యక్ర మాన్ని హైజాక్‌ చేసి షో చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బోడుప్పల్‌ పంచాయతీ ఉపసర్పం చ్‌గా సుద్దకుంట చెరువు నామరూపాలు లేకుండా కబ్జాదారులకు బంగారు పళ్లెంలో అప్పగించిన వారు నేడు బంగారం కుటుం బాలను తయారు చేస్తానని ఓట్ల వేటకు బయలుదేరడం విస్మయా నికి గురిచేసిందని బోడుప్పల్‌ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్‌ బాలరాజ్‌ గౌడ్‌ ఆందోళన వ్యక్త పరిచారు.వాస్తవానికి రా చెరువు శుద్ధి కార్యక్రమం హెల్పింగ్‌ హాండ్స్‌ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రశాంత్‌ కార్యక్రమాన్ని రూపొందించగా ఒకే ప్రపంచ ప్రచార సంస్థ కన్వీనర్‌గా రమణారెడ్డి పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆచ రణ రూపంలో జరిగే విధంగా శ్రమించడం అభినందించదగ్గ పరిణామం. ప్రభుత్వ దష్టికి సైతం తీసుకెళ్లి మంత్రిగా బాధ్య తలు నిర్వహిస్తున్న స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి రా చెరువు పై దష్టి సారించే విధంగా తమ వంతు కషి చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close