Home Blog
★ తప్పు చేయని వారెవరు? ★10మంది సిఎంలు..67 కేసులు ★ తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలు 28, ఎమ్మెల్యేలు 149 ★ జాగ్రత్త పడిన కాంగీదేశం (ఆదాబ్ హైదరాబాద్ సంచలన కథనం) (అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢల్లీ, ఆదాబ్ హైదరాబాద్) ఏం చేసినా అడిగేవారు లేరు. అధికారం చాటున అక్రమాలు. తెర మాటున తెగించే అవినీతి. డక్కీమక్కీలు తిని కోట్లు దా(దో)చుకున్నారు. దిగజారటానికి 'పవర్' ఓ సుఖవంతమైన జారుడుబండ. ఇంకా దిగజారి పదవుల నీడలో దోపిడి, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు... ఇవి రాజకీయుల ముసుగులో దందాలు చేసే 'నీచ్'మైన.. కమీన్.. కుత్తేలకు కాలం చెల్లింది....
కెకె మహేందర్ రెడ్డిగా రాజకీయాల్లో నలుగుతున్న కె. కరుణ మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయుడు కెటి రామారావుకు సవాల్ విసురుతున్నారు. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి సంఘంలో ఉన్న కెకె మహేందర్ రెడ్డి మొదటి నుంచీ తెలంగాణవాది. దాంతోనే ఆయన కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చాలా కాలం కీలక పాత్ర పోషించారు. కెసిఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగాడు. కరీంనగర్ జిల్లాలో కెసిఆర్‌తో పాటు తిరిగారు....
హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాజకీయమన్నాక అనేక మార్పులు చేర్పులు జరుగుతుంటాయని, ఏ నిర్ణయం వెనకైనా ఆనాటి పరిస్థితుల ప్రభావం, దేశ అవసరం కూడా ఉంటుందని కాంగ్రెస్‌ నాయకుడు జానారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు తన నివాసంలో జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. అకారణంగా 9 మాసాల ముందు అసెంబ్లీని ఎవరైనా దేశంలో రద్దు చేశారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌తో తమకు పోలికే లేదన్నారు. చంద్రబాబునాయుడు మా పార్టీతో కలిసి వస్తున్నారని ఆయన చెప్పారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, .. ఇతరత్రా కారణాలతో టీడీపీతో పొత్తు పెట్టుకొంటున్నట్టు...
- టార్గెట్లు (చేయ) వద్దు - ఉద్యమచరిత్రలో చెరిపేసే కుట్ర - కడుపుకాలి రగిలిపోతున్నారు - కేసుల బెదిరింపులు.. వేధింపులు ఎక్కువ - ఒక్క పదోన్నతీ లేదు - సభలలో అధికారుల ఊసే ఉండదు - పదవుల కోసం పంచన ద తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావుతో ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ (అనంచిన్ని వెంకటేశ్వరరావు) ఉద్యోగులు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం. ఉద్యమం చేసిందెవరు.? లాభం పొందిందెవరు..? ఆ నలుగురు వెనుక ఉన్న ఈ నలుగురు ఎవరు.? నాలుగు స్థంబాలాటలో.. నలుదిక్కులా బిక్కచచ్చి.. బిక్కుబిక్కుమంటూ... ఏ క్షణాన...
హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): చిత్ర విచిత్రాల కు కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ పార్టీ. ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి అలాగే ఉంటది అని చెబుతారు. రాహుల్‌ గాంధీ హైద్రాబాద్‌ పర్యటనలో ఓయూ విద్యార్థి నేతలకు సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. అదే సమయంలో ఓయూలో సభ పెట్టాలన్నా కుదరలేదు. దీంతో రాహుల్‌ ప్రత్యేకంగా ఓయూ నేతలతో భేటీ అయ్యారు. సీట్లు ఇస్తామన్నారు. అలాగే సరూర్‌ నగర్‌ స్టేడియం లో జరిగిన సభకు ఓయూ నేతలను ఆహ్వానించారు. వారితో కలిసి సభలో చేతులు పైకెత్తి...
- చేతికి ఇవ్వని కాంగ్రెస్‌ - ఈసీకే నేరుగా ఇచ్చే అవకాశం - కొందరికి గుచ్చుకోనున్న గులా'బీ ఫారాలు' - 17 మంది గెలుపు డౌట్‌ - అందులో 6గురు 'అవుట్‌'..? (రమ్యా చౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌) ఎట్టకేలకు అన్ని పార్టీల అభ్యర్థుల జాబితాలు ఓ కొలిక్కి వచ్చాయి. దీంతో ఇక బి ఫారాల అంద చేసే కార్యక్రమాలకు తెర లేవనున్నది. ముందున్న కారు: అక్టోబర్‌ 6న అసెంబ్లీ రద్ధు ప్రకటన చేసిన వెంటనే కేసీఆర్‌ 105 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి ఎన్నికల శంఖారావం పూరించారు. అనంతరం రెండో జాబితాను ప్రకటించారు....
హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మహాకూటమిలో సీట్ల పంపకాల పై ఓ స్పష్టతకు వచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం, శనివారం కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది.. ఈ నేపథ్యంలో టికెట్‌లు దక్కవని భావిస్తున్న పలువురు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ, హైదరాబాద్‌లతో పాటు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. తమకు అన్యాయం జరుగుతుందని, అటు ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట, హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ ఎదుట నిరసనకు దిగారు. కుటమి ఒప్పందంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం టికెట్‌ను కాంగ్రెస్‌ ముందస్తు ఆందోళనలు అధిష్ఠానం తెలంగాణ...
రాయ్‌పూర్‌ : దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలని ప్రజలు బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే కుంభకోణాలతో ప్రజల సొమ్ము లూటీ చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంకెర్‌లో శుక్రవారంనాడు జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. మోదీ సర్కార్‌ విధానాలు, పనితీరుపై విమర్శలు గుప్పించారు. రాఫెల్‌డీల్‌కు సంబంధించి మరోసారి ప్రధాని మోదీపై రాహుల్‌ నిప్పులు కక్కారు. రూ.30,000 కోట్ల డీల్‌ను పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి మోదీ బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కేవలం...
న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ ఆశావాహుల బుజ్జగింపుల పర్వం గురువారం కొనసాగింది. జిల్లాల వారిగా కాంగ్రెస్‌ పార్టీలోని ఆశావహులతో ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ వార్‌రూంలో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు భేటీ అయ్యిచర్చలు జరిపారు. జిల్లాల వారీగా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, ఆశావహలుతో చర్చలు నిర్వహించి టికెట్లు రానివారిని బుజ్జగించారు. కూటమి అధికారంలోకి రాగానే తగిన న్యాయంచేస్తామని హావిూ ఇచ్చారు. బుధవారం కాంగ్రెస్‌ అగ్రనేతలు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో...
హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హైదరాబాద్‌లోని అవిూర్‌పేట మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే కారణాలపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. ఉదయం మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తుకు వెళ్లిన ఆ వ్యక్తి.. సారథి స్టూడియో ప్రహారీ గోడవైపు దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలై...
Other Language