Featured

నల్లధనం ఆ బ్యాంకులకే…

  • తీస్తారా లేదా అంటున్న స్విస్‌ బ్యాంక్‌..
  • లేదంటే మా బ్యాంకులో కలిపేస్తార..
  • ముందుకురాని ఖాతాదారులు..
  • రేపుమాపంటున్న ప్రభుత్వం..

అక్రమంగా దాచుకున్న సొమ్మంతా ఆ బ్యాంకులే తీసుకుంటున్నారు.. దాచుకున్నవాడు ఎంతకు రాకపోయేసరికి చేసేదేమి లేక వారి బ్యాంకులలోనే కలిపేసుకుంటున్నారు.. కష్టపడి సంపాదించిందీ రూపాయైనా పదికాలాల పాటు ఉంటుంది. అదే అక్రమంగా ఎదుటివారిని పీల్చిపిప్పి చేసి అష్టకష్టాలు పెట్టి సంపాదించిన సొమ్ము ఎన్నిరోజులైనా మనకు దక్కదు.. ఏదో ఒక రూపేణా దూరమైపోతుంది.. ఇప్పుడు జరుగుతుందీ అదే.. వేల, లక్షల కోట్ల రూపాయలు జీతాలు వస్తున్నా అప్పనంగా వస్తుందని సంపాదించిన అవినీతి డబ్బును ఎ్కడ దాచాలో అర్థం కాలేదు.. అందుకే రహస్యంగా వేల కోట్ల రూపాయలను దేశాలు దాటించారు. అక్రమంగా సంపాదించినా కోట్ల ధనాన్ని అంతా స్విస్‌ బ్యాంకుల్లో దాచిపెట్టారు. నెలలు కాదు, సంవత్సరాలు దాటుతోంది. ఐనా దాచినవాడు పత్తాకు లేడు. కాని ఎక్కడ దాచిపెట్టిన డబ్బు అక్కడే ఉంది. వేల కోట్ల రూపాయలు మురిగిపోతుంది. దాచిపెట్టిన ఖాతాదారులు వస్తారని ఎదురుచూసిన బ్యాంకులకు ఎవ్వరూ రాకపోయేసరికి చివరి హెచ్చరికను పంపారు. తమ బ్యాంకుల్లో దాచిన పెట్టిన డబ్బును వచ్చి తీసుకెళ్లాలని లేనిపక్షంలో తమ బ్యాంకుల్లోనే కలిపేసుకుంటామని చివరి మాటగా చెప్పారు. కాని దాచుకున్న డబ్బును తీసుకోవడానికి ఒక్కరూ కూడా ముందుకొచ్చిన దాఖలాలే కనిపించడం లేదు. అధికారంలోకి రాగానే విదేశాల్లో మూలుగుతున్న లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని బయటికి తెచ్చి, అక్రమంగా దాచుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం ఆ మాటనే మరిచిపోయింది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరుసంవత్సరాలవుతున్న నల్లధనంపై రేపుమాపంటూ చర్యలు తీసుకుంటామని చెపుతూనే ఉంది. కాని ఇప్పటివరకు తెచ్చిందీ లేదు, చర్యలు తీసుకుందీ లేదు. మనదేశంలో అక్రమంగా సంపాదించి దేశంకాని దేశంలో దాచిపెట్టి చివరకు ఎటుకాకుండా చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మూలుగుతున్న నల్లధనం చివరికి విదేశీ బ్యాంకుల వశం కానున్నాయి. మన దేశంలో కనీస సదుపాయాలు లేని గ్రామాలు వేలల్లో ఉన్నాయి. వాటికి సౌకర్యాలు కల్పించవచ్చు. లేదా అక్రమంగా సంపాదించే వారిపై కఠినచర్యలు తీసుకుంటే మరొకరు విదేశాల్లో డబ్బును దాచిపెట్టాలనే భయపడుతారు. కాని ప్రభుత్వం అటు చర్యలు తీసుకోవడం లేదు, నల్లధనాన్ని భద్రంగా ఇండియాకు తేవడం లేదు. చివరకు మన ప్రజల కష్టమంతా వేరే దేశప్రజల పరం కానుందీ..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌

అంచనాలకు మించి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారు.. లెక్కలేనంతగా సంపాదించినా నల్లధనాన్ని ఎక్కడ దాచాలో తెలియక దొడ్డిదారిన వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారు. విదేశాల్లోని స్విస్‌బ్యాంకుల్లో దాచిన నల్లధనం ఇప్పుడు మురికిపోతుంది. దాచినవారు ఎవరో బ్యాంకులకుతెలిసి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏ ఒక్కరూ కూడా స్పందించడం లేదని తెలుస్తోంది. అందుకే స్విస్‌ బ్యాంకులు చివరి హెచ్చరికను జారీ చేశాయి. స్విస్‌బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని ఎవరికి వారు వచ్చి పట్టుకెళ్లండి లేకపోతే నిల్వ ఉన్న వేల కోట్ల రూపాయల ధనాన్ని అంతా బ్యాంకులోనే కలిపేసుకుంటామని మరీ మరీ చెపుతోంది. ఒక పక్క కేంద్రప్రభుత్వం విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకువచ్చి దేశప్రజలందరికి పంచిపెడదామని చెప్పుతున్న ప్రభుత్వం ఆరు సంవత్సరాలు గడిచినా నల్లధనం ఊసే ఎత్తడం లేదు. విదేశాల్లో నల్లధనాన్ని దాచిన వారు తెచ్చుకునే ధైర్యం చేయడం లేదు. అటు తీసుకువద్దామనే చెపుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోక, ఇటు ఖాతాదారులు భయంతో ముందడుగు వేయడం లేదు. ప్రజల నుంచి అక్రమంగా, పీడించి, పీల్చిపిప్పిచేసిన సొమ్ము ఇప్పుడు విదేశీ బ్యాంకుల్లోనే కలవనుంది.

స్విస్‌ బ్యాంకుల్లో కలవనున్న నల్లధనం..

ప్రపంచవ్యాప్తంగా నేతలు పారిశ్రామికవేత్తలు అక్రమంగా సంపాదించిన డబ్బునంతా స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో జమ చేశారు. చాలా నల్లడబ్బు స్విస్‌ బ్యాంకుల్లో నిక్షిప్తమైపోయింది. ఐతే అలా జమ చేసి ఇప్పటివరకు తమ ఖాతా వైపు తొంగిచూడని వారు వేలల్లో ఉన్నారు. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆ సొమ్మును అలాగే వదిలేస్తున్నారట. అలా మొత్తం 2600 ఖాతాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎటువంటి లావాదేవీలు లేకుండా కోట్ల సొమ్ము ఉంది. ఆ 2600 ఖాతాల్లో పన్నెండు మంది భారతీయుల ఖాతాలు కూడా ఉన్నట్లు తెలిసింది. వారు తమ డబ్బును తీసుకోవడం లేదని, ఎన్ని నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని చెపుతున్నారు. 2015వరకు ఆ పన్నెండు మంది భారతీయుల సొమ్ము ఏకంగా మూడు వందల కోట్లకు చేరింది. ఇప్పుడు ఈ సొమ్మును సదరు వ్యక్తుల వారసులు ఆధారాలతో సహా వచ్చి తీసుకోవాలని లేదంటే ఆ సొమ్మునంతా స్విస్‌ ప్రభుత్వ ఖాతాల్లోకి జమ అవుతోందని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. భారతీయులు పన్నెండు ఖాతాల్లో రెండు ముంబై, కోల్‌కతా నగరాలకు చెందిన అడ్రస్‌లున్నాయి. ఒకటి డెహ్రాడూన్‌కు చెందిన వ్యక్తిది. కొన్ని ఖాతాలు సంస్థానాధీశులీ, బ్రిటిష్‌ కాలంలో బ్రిటన్‌ ప్రాన్స్‌లో స్థిరపడిన భారతీయుల ఖాతాలు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. సదరు భారతీయుల వారసులు ఆ మూడు వందల కోట్లను నెలరోజుల్లో వచ్చి ఆధారాలతో వచ్చి బ్యాంకులో కలిస్తే ఆ మొత్తం అందజేస్తారు. లేదంటే స్విస్‌ ఖాతాల్లోకి చేరిపోతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close