Featuredస్టేట్ న్యూస్

తెలంగాణలో బిజెపి ఆపరేషన్‌…

టిఆర్‌ఎస్‌పైనే గురిపెట్టిన ఆగ్రనాయకులు..

ఒక్కొక్కరిని లాగేందుకు వ్యూహం…

రెండు రోజుల్లో కెసిఆర్‌కు షాక్‌..

పలువురు టిఆర్‌ఎస్‌ నేతలు కాషాయంలోకే…

తెలంగాణపై బిజెపి ఆపరేషన్‌ మొదలెట్టిందా అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.. ఇన్నిరోజులు ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఇతర పార్టీలలో ఉన్నవారందరిని చేర్పించుకున్న టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వంపైననే బిజెపి ఆగ్రనాయకత్వం గురిపెట్టింది.. తెలంగాణలో తుప్పుకాకుండా మెరికల్లాంటి నాయకులంతా తమలో ఉందనుకుంటున్న కెసిఆర్‌కు భారీషాక్‌ ఇవ్వనున్నారు బిజెపి నాయకులు. వివిధ పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారందరూ అక్కడ ఉండలేక, బయటికి రాలేక సతమతమవుతూ లోలోపల కుమిలిపోయే వారు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది.. వారందరికి ఆకర్షించే పనిలో బిజెపి శ్రేణులు సిద్దమయ్యారు. వేరే ఇతర పార్టీలో చేరుతే కెసిఆర్‌తో వేగడం కష్టమని ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయపార్టీ కమలం వైపు పోవడమే సరియైన నిర్ణయంగా భావించి వెళ్లేందుకు సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది. బిజెపి జాతీయ నాయకులు కూడా వచ్చేవారందరికి స్వాగత తోరణాలతో రెడిగా ఉన్నారని, వారు కూడా ఎవ్వరిని వదలకుండా ఒక్కొక్కరుగా అందరిని తమవైపు తిప్పుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు.. టిఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలో ఉన్నా చాలామంది సీనియర్‌ నాయకులు రెండు, మూడు రోజుల్లో బిజెపి పార్టీలో చేరుపోతున్నారని తెలుస్తోంది. అందులో చేరితేనే భద్రతతో పాటు, రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఉన్నారని, బిజెపి కేంద్రనాయకత్వం కూడా వచ్చే వారందరికి అన్నిరకాలుగా అదుకుంటామనే అభయం ఇచ్చిందనే వార్తలు వెలువడుతున్నాయి.. తెలంగాణలో తమ పార్టీ తప్ప వేరే పార్టీ ఉండద్దని వ్యూహాలు రచిస్తూ దాదాపుగా అన్నింటిని నామరూపాలు లేకుండా చేశారు కెసిఆర్‌. కాని ఇప్పుడు తెలంగాణలో ప్రధాన పార్టీగా ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపైననే కమలం కన్నేసింది. కమలం వ్యూహానికి కారు ఏలా తట్టుకుంటుందో, కెసిఆర్‌ తమ కేడర్‌ వెళ్లకుండా ఏలాంటి పాచికలు వేయనున్నారో చూడాల్సిందే.. కారు విడిచి కమలం గూటికి చేరేదెవరో తెలియాలంటే రెండు, మూడు రోజులు ఆగాల్సిందే…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఇప్పటివరకు ఒక్క టిఆర్‌ఎస్‌ పార్టీకే సాధ్యమనుకొంది. కాని ఇప్పుడు అంతకుమించి ఎవరి అంచనాలకు తెలియకుండా బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది. తెలంగాణలో పార్టీని పూర్తిగా అన్ని రకాలుగా సిద్దంచేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిసిపోతుంది. అందుకే బిజెపి కేంద్రనాయకత్వం అదుపుతప్పని గురి టిఆర్‌ఎస్‌ వైపు పెట్టినట్లు తెలుస్తోంది. బిజెపి అగ్రనాయకుల కన్నుపడితే ఏ పార్టీఐనా వారి సొంత మవ్వాల్సిందే.. మొన్నటివరకు తెలుగు రాష్ట్రాల మీద సంప్రదాయ పద్దతిలో పార్టీ ఎదుగుదల కోసం ప్రయత్నించిన బిజెపి పెద్దలు, అవేవి సరిగ్గా ఫలితాలు ఇవ్వకపోవడంతో రూటు మార్చినట్లు తెలుస్తోంది. కొన్ని పనులు జరగాలంటే అప్పుడప్పుడు అడ్డదారి వినియోగించక తప్పేలా లేదనే ఆలోచనతో ముందుకు నడుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకుల ఆలోచనలు మొత్తంగా మారిపోయాయి. తెలంగాణలో బిజెపి పార్టీకి కావాలసినంత స్పేస్‌ ఉందన్న విషయాన్ని గుర్తించిన పార్టీ నాయకత్వం ఇప్పటివరకు తాము అంతగా దృష్టి చేయకపోవడంతోనే పార్టీ ఎదగలేదని, తమ స్థాయిలో పావులు కదిపితే తెలంగాణలో సమీకరణాలు పూర్తిగా మారటమే కాదు, దక్షిణాదిన పాగా వేయాలన్న తమ ఆలోచన ఆచరణలోకి తీసుకురావచ్చన్న విషయాన్ని వారు గుర్తించారు.

రెండురోజుల్లో బిజెపిలోకి భారీ చేరికలు..

సంప్రదాయ పద్దతిని అవలంభిస్తే పార్టీ నడపడం కష్టమని అందుకే అవకాశాలు ఉన్నప్పుడల్లా పార్టీ సిద్దాంతాలు పక్కన పెట్టక తప్పేలా కనిపించడం లేదంటున్నారు. నాటి నుంచి తెరవెను చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఒక స్థాయికి రావటమే కాదు. మరో రెండు రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త హడావుడి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లుగానే తాజగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. టిఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తాజాగా ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. అవసరం కోసం వాడుకొని చివరి సమయంలో మోసం చేసిన కెసిఆర్‌ మీద గుర్రుగా ఉన్న ఆయన రెండురోజుల్లో మాజీ ఎంపి చాడ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్థన్‌తో పాటు వందలాదిగా బిజెపిలో చేరనున్నట్లు జితేందర్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం.

టిఆర్‌ఎస్‌లో విసిగిపోతున్న నేతలు…

తెలంగాణ ముఖ్యమంత్రి అవమానాలతో విసిగిపోయిన పలువురు గులాబీ నేతలు బిజెపిలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. అంతేకాదు మరికొద్ది రోజుల్లో బిజెపి కీలక బాధ్యతలు జితేందర్‌ రెడ్డికి అప్పగించే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో బిజెపి బలపడేందుకు వీలుగా కొన్ని నిర్ణయాలు తీసుకొనున్నారు. అధికార టిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలతో పాటు కాంగ్రెస్‌, టిడిపి నేతల్ని పార్టీలోకి వచ్చేలా చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మెదక్‌ మాజీ ఎమ్మెల్యె పట్లోళ్ల శశిధర్‌రెడ్డి తదితర నేతలు బిజెపిలో చేరనున్నారు. టిడిపికి చెందిన నేతలు సైతం బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన పలువురు నేతలు కూడా పార్టీలో చేరేందుకు సిద్దం కానున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి కొత్తవెర్షన్‌ 2.0 చూస్తారంటూ కొందరు నేతలు వ్యాఖ్యానించటం గమనార్హం..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close