Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

బిజెపి విజన్‌ 2023

అధికారమే లక్ష్యంగా కార్యాచరణ

  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

న్యూఢిల్లీ : తెలంగాణలో 2023 నాటికి అధికారంలోకి రావడమే భాజపా లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఇందు కోసం పార్టీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ సహా ముఖ్యనేతల ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో భాజపా సాధించిన విజయం పట్ల అడ్వాణీ, సుష్మాస్వరాజ్‌ ఆనందం వ్యక్తంచేశారని తెలిపారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించినందుకు పార్టీ పెద్దలు అభినందంచారని లక్ష్మణ్‌ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రావాలని కూడా అద్వానీ ని కోరాం. శుక్రవారం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడుతూ.. భాజపా గెలుపును జీర్ణించుకోలేక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా, బయ్యారం ఉక్కు పరిశ్రమ అంటూ తెరాస రాజకీయ దాడికి దిగుతోందని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణకు భాజపా ప్రభుత్వం చాలా నిధులు కేటాయించిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో పెద్దలతో పాటు కార్యకర్త స్థాయి నేతల వరకు ఆహ్వానిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు. జాతీయ పదాధికారుల సమావేశంలో తెలంగాణలో పార్టీ విజయం సాధించడాన్ని అమిత్‌షా అభినందించారన్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఐఆర్‌ పెంపు, సీపీఎస్‌ రద్దు వంటివి చేస్తే తెలంగాణలో కేసీఆర్‌ వాటిని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. అన్ని పార్టీల నుంచి కూడా నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, మోదీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చేవారికి సాదరంగా ఆహ్వానిస్తామని లక్ష్మణ్‌ స్పష్టంచేశారు. ఎవరెవరు వస్తారన్నది త్వరలోనే తెలుస్తుందని అన్నారు. అయితే బిజెపిలోకి రావడానికి చాలామంది ఉత్సుకత చూపుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా నిధులు కేటాయించింది.కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ కింద పేదలకు వైద్య సహాయం అందిస్తోంది. ఆరోగ్య శ్రీ బకాయిలు పెరుకుపోయాయి. లక్షా 80 వేల కోట్లకు రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేర్చారు. తెలంగాణలో ఈబీసీ 10 రిజర్వేషన్లు కేసీఆర్‌ అమలు చేయడం లేదు. వారికి ఒవైసీ కోసం ముస్లిం రిజర్వేషన్లు కావాలి. ఈబీసీ లకు 10 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేసేలా బీజేపీ పోరాటం చేస్తుంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఐఆర్‌, సీపీఎస్‌ రద్దు వంటివి చేస్తే ఇక్కడ కేసీఆర్‌ ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు. మోదీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం” అని అన్నారు.


Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close