Featuredస్టేట్ న్యూస్

తెలంగాణలో బీజేపీకి చోటు లేదు

మున్సిపల్‌ ఎన్నికలకు సమాయత్తంకండి

  • దసరా కల్లా పార్టీ భవనాలు పూర్తికావాలి
  • సభ్యత్వ నమోదులను త్వరగా పూర్తిచేయండి
  • ముఖ్యనేతల సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌

తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. బుధవారం తెలంగాణ భవన్‌లో సీఎం క కేసీఆర్‌ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల ఆవశ్యకత, మున్సిపల్‌ ఎన్నికల సమాయత్తంపై చర్చించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలే పార్టీ శ్రీరామ రక్షా అని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం, సభ్యత్వ నమోదు, మున్సిపల్‌ ఎన్నికల పై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులతో పాట.. ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ ఇంచార్జీలు హాజరయ్యారు. ప్రధానంగా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. జూన్‌ 24న 29 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ నేపధ్యంలో దసరా లోపు భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రణాళిక రచించారు. సమావేశంలో పార్టీ కార్యాలయాల నమూనాలతో పాటు, ఓక్కో కార్యాలయానికి 60 లక్షల చొప్పున పార్టీ నిధులను జిల్లా ఇంచార్జీ నేతలకు గులాబి బాస్‌ అందించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతోంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనుకున్న గడువులోపు పార్టీ సభ్యత్వ టార్గెట్‌ ను రీచ్‌ అయ్యోలా సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో పోడు భూముల అంశం హాట్‌ టాపిగ్గా మారింది. సమావేశంలో కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌ రావు సీఎం కేసీఆర్‌ దృష్టికి పోడు భూములు అంశం తీసుకువచ్చారు. పోడు భూములు సమస్యకు సీఎం శాశ్వత పరిష్కారం చూపుతానని హావిూ ఇచ్చినట్టు వనమా తెలిపారు. బీజేపీ రాష్ట్రంలో దూకుడు పెంచిన నేపధ్యంలో మున్సిపల్‌ ఎన్నికలను నేతలెవరూ ఆషామాషీగా తీసుకోవద్దని గులాబీ బాస్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అసలు బీజేపీకి తెలంగాణలో స్థానమే లేదని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీరామ రక్షగా నిలుస్తాయని సమావేశంలో పార్టీ నేతలకు తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కేసీఆర్‌ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఏఏ అంశాలపై దృష్టి సారిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close