సూపర్ స్టార్ కృష్ణను కలిసిన భిక్షపతియాదవ్‌

0

(హైదరాబాద్, ఆదాబ్, హైదరాబాద్): కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ హీరో కృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలంటూ ఆదివారం నానక్‌రాంగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నానక్‌రాంగూడలో నివాసం ఉంటున్న హీరోకృష్ణ నివాసానికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. కృష్ణ సానుకూలంగా స్పందించినట్లు భిక్షపతియాదవ్‌ తెలిపారు. కార్యక్రమంలో కొండా రవిగౌడ్‌, నర్సింహ్మయాదవ్‌, ముత్యంరెడ్డి, కైలాశ్‌సింగ్‌, ఈశ్వర్‌ తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here