పేరుకే పెద్ద దేశం.. పెరగని ఆదాయం..

0

దేశం ఎదుగుతోంది… రోజురోజుకు ఎదిగిపోతూ ఉంది… పెద్ద దేశం, పెద్ద ప్రజాస్వామ్య దేశం, పెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం, ఖనిజాలకు, వనరులకు కొదవలేని దేశం.. టెక్నాలజీ పరంగా, వ్యాపార పరంగా మన దేశానికి చాటు లేదంటూ గర్వంగా చెప్పుకుంటున్న మన సువిశాల భారతదేశం ఇప్పటికి ఇంకా ఎదుగుతూనే ఉంది… కోటీశ్వరులుఅలాగే ఉంటున్నారు. వేతన జీవి మాత్రం అన్ని పనులు చెల్లిస్తూ దినమో గండంగా బతుకుతున్నారు.. మనం చేసే వ్యాపారానికి, తినే తిండికి, మన చేసే ఉద్యోగానికి ప్రతి సంవత్సరం ఐటి దాఖలు చేయాలి.. మన సంపాదనెంత, మన ఖర్చులెంత, మన వ్యయమెంత అనే వివరాలు అన్నీ పొందపర్చాలి. మన కట్టే ఐటి రిటర్న్‌తో మన దేశ ఆర్థికవ్యవస్థ కూడా బలం పుంజుకుంటోంది. అన్ని తెలిసి లక్షలు, కోట్లు సంపాదించే బడా బడా పారి శ్రామిక వేత్తలు మాత్రం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే పనిలో బిజిబిజీగా ఉండి ఐటి రిటర్న్‌ గాలికొదిలేస్తుంటే, నెల జీతంతో బతికే సగటు సామాన్యుడు మాత్రం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం తన బాధ్యతను నెరవేర్చుతున్నాడు.. అందుకే మనదేశంలో కొత్తగా ధనవంతులు, కోటీశ్వరులు పుట్టుకరావట్లేదు.. ఉన్నవాళ్లే వారి స్థానాన్ని కాపాడుకుంటూ కింది వారిని కిందికే తొక్కివేస్తున్నారు… ఐనా దేశం అభివృద్ది చెందుతుందనే మాట మాత్రం మన తరం కాదు కదా, మన తరతరాలు కూడా మరవరు…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

భారతదేశం అభివృద్ది చెందుతున్న దేశం కాదు.. అన్ని రంగాల్లో కాంతులీనుతున్న బంగారు కలల దేశం.. ఆర్థికపరంగానే కాకుండా అన్ని రంగాల్లో సంవత్సరం సంవత్సరంకు భారత్‌ వృద్ది రేటు పెరుగుతుందని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. కాని భారత్‌లో కోటీశ్వరుల సంఖ్యతో పాటు సగటు జీవి ఆర్థిక పరిస్థితి అనుకున్నంత పెద్ద మొత్తంలో ఆశించిన స్థాయిలో పెరగడం లేదని తాజాగా డైరెక్ట్‌ ట్యాక్స్‌ సెంట్రల్‌ బోర్డు తన నివేదిక ద్వారా వెల్లడించింది. 125కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కోటీశ్వరులు కేవంల 1.5 లక్షలమంది మాత్రమే ఉన్నట్లు నిరూపణ అయింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి కొన్ని సంవత్సరాలు దాటుతున్నా, పాలకులు ఎందరూ మారినా, సామాన్యుడి ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగపరచడంలో మాత్రం విఫలం చెందారని తెలుస్తోంది. సామాన్యుడి అభివృద్ది మా జెండా అని మాత్రం చెపుతున్నారు కాని వాటిని అమలు పరచడంలో ఎంత నిర్లక్ష్యం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. 2018.19 సంవత్సరానికి గాను తమ వార్షిక ఆదాయం కోటి రూపాయలు దాటింది అంటూ ప్రభుత్వానికి ఐటీ రిటర్న్‌ దాఖలు చేసిన వారు అతి తక్కువ శాతం ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత పెద్ద దేశంలో కోట్లాది మంది ఉన్న మన జనాభాలో ఒక కోటి చిల్లరనే కోటీశ్వరులు ఉంటే మరీ మిగతా వారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఒక్క శాతం మందే ఎదుగుతూ ఉంటే అదీ దేశాభివృద్ది ఏలా అవుతుందని ఆర్థికనిపుణులు అంటున్నారు. కనీసం యాభై శాతం కాకున్నా పది, ఇరవై శాతం జనాభాలో ఎదుగుదల ఉంటే అప్పుడు దేశ అర్థిక పరిస్థితితో పాటు, ప్రజల తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని ఆశించవచ్చు. కాని అనుకున్న స్థాయికన్నా మరీ తక్కువగా ఉండడంతో ప్రజల అభివృద్ది నిపుణులు, ప్రభుత్వం చెపుతున్నట్లుగా లేదని తెలిసిపోతుంది. స్వతంత్య్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటుతున్న ఇప్పటికి దేశంలో కోటీశ్వరులే ఐటి రిటర్న్‌ ఎగవేయడంలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి సంపాదించిన సంపాదనలో అక్రమమో, సక్రమమో తెలియదు కాని సగానికన్నా తక్కువకే ఐటి రిటర్న్‌ దాఖలు చేస్తున్నారు. మిగతా మనీ అంతా నల్లధనంగా మార్చుకుంటున్నారని తెలిసినా పట్టించుకునే వారు మాత్రం ఒక్కరూ లేరు.

  భారతదేశం వంటి దేశాలలో ఈ సంఖ్య చాలా తక్కువ. జిడిపి వినియోగం విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే రిటర్న్‌ దాఖలు చేయడం విచారించదగ్గ విషయంగా చెబుతున్నారు. 2014.15 సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 69 వేలు మాత్రమే ఉండేదని కాని నాలుగేళ్లలో ఇది ఇంతలా పెరగడం జరిగిందని, ఇందులో కూడా ఎక్కువగా వేతన జీవులే ఉండటం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. వ్యాపారాలు చేసుకునే వారు తమ డబ్బును బ్లాక్‌ మనీగా మార్చి లెక్కల్లోకి రాకుండా చేస్తూ కోట్లు ఉన్నా కూడా లేనట్లుగా రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. వేతన జీవులకు మాత్రం తమ మొత్తం జీతం చూపించుకోక తప్పదు. అందుకే రిటర్న్‌లు దాఖలు చేసే వారు ఎక్కువగా వేతన జీవులు ఉంటారు. రాబోయే కాలంలోనైనా పన్ను చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగేందుకు మన వంతు ప్రయత్నం చేయాలని అర్థికనిపుణులు అంటున్నారు. ప్రభుత్వం తరపున పన్ను చెల్లింపు దారులు అందరూ తమ సకాలంలో పన్ను చెల్లించాలని ఎంతగా అవగాహన కల్పించినా అది సాధ్యం కావడం లేద. ఐటి రిటర్న్‌ దాఖలు చేసే వాళ్లలో ఎక్కువ మార్పులు చేయాలని రోజువారి వేతన జీవులకంటే బడా పారిశ్రామిక వేత్తలు కోట్లలో వ్యాపారాలు చేస్తున్న పన్ను చెల్లింపులో మాత్రం ఒక విధమైన నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దేశం అర్థికంగా నిలదొక్కుకోవాలంటే అందరి వారి విధులతో పాటు, వారి బాధ్యతలను కూడా పాటించినప్పుడే అది సాధ్యమవుతుంది. బడా కోటిశ్వరులకు ఒకలా, వేతన జీవులకు ఒకలా ఉంటే మార్పు అది సాధ్యం  కాదని, దేశం కూడా అభివృద్ది చెందుతూనే ఉంటుందనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. కోట్లలో సంపాదన ఉన్నా, కొద్దిమందే కోటీశ్వరులుగా చూపడం పట్ల, మిగతా బడా బాబులు మాత్రం చీకట్లో వెలుగుపోందే అవకాశాలు మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా చేస్తే అందరి వివరాలు బయటపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here