బిగ్‌ బాస్‌ 3 హోస్ట్‌: కింగ్‌ వర్సెస్‌ వెంకీ

0

బిగ్‌ బాస్‌ – తెలుగు కొత్త సీజన్‌ కి టైమ్‌ దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టిసిపెంట్స్‌ జాబితాని స్టార్‌ మా వెలువరించింది. ఇక హోస్ట్‌ విషయమై ఇప్పటికీ క్లారిటీ లేదు. షో నిర్వాహకులు హోస్ట్‌ ఎవరు అన్నదానిపై అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్‌ నెలకొంది. ఈలోగానే రోజుకో పేరు ఫిలింసర్కిల్స్‌ లో వినిపించడంతో అంతకంతకు కన్ఫ్యూజన్‌ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఎన్టీఆర్‌- నాని- చిరంజీవి- నాగార్జున- వెంకటేష్‌- విజయ్‌ దేవరకొండ- రానా దగ్గుబాటి అంటూ రకరకాల పేర్లు వినిపించాయి. బిగ్‌ బాస్‌- 1 సీజన్‌ ని బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేసిన ఎన్టీఆర్‌ ని ఒప్పించేందుకు షో నిర్వాహకులు చాలా ప్రయత్నించినా వీలుపడలేదు. ఆ క్రమంలోనే రకరకాల పేర్లు తెరపైకొచ్చాయి. అయితే గత మూడు రోజులుగా విక్టరీ వెంకటేష్‌ ని హోస్ట్‌ గా ఫైనల్‌ చేసేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. దగ్గుబాటి ఫ్యామిలీపై కస్సుబుస్సుమనే నటి శ్రీరెడ్డి సైతం విక్టరీ వెంకటేష్‌ ఈ షోకి హోస్ట్‌ గా ఫైనల్‌ అయ్యారని ప్రకటించడంతో మరోసారి దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే వెంకీని ఫైనల్‌ చేశారన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదని తాజాగా స్టార్‌ -మా సన్నిహిత వర్గాలు ధ వీకరిస్తున్నాయి. ఈ షోకి ఇప్పటికే నాగార్జున ఫైనల్‌ అయ్యారు. మీలో ఎవరు కోటీశ్వరుడు? సీజన్‌ 1ని ఆయన ఎంత పెద్ద సక్సెస్‌ చేశారో తెలిసిందే. అంతకుమించి బిగ్‌ బాస్‌- 3 షోని హోస్ట్‌ గా సక్సెస్‌ చేస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఆయననే ఫైనల్‌ చేశారు. కానీ ఆ సంగతిని ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అయితే నాగార్జున బ్యాక్‌ టు బ్యాక్‌ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో మూవీ కోసం ఆయన విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. తదుపరి కళ్యాణ్‌ క ష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రాన్ని ప్రారంభిస్తారు. వీటితో పాటు మరిన్ని సీక్వెల్స్‌ గురించి చర్చ సాగుతోంది. ఈ మధ్యలో ఆయన బిగ్‌ బాస్‌ -3 కోసం సమయం కేటాయిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు వెంకీ సైతం వెంకీ మామ షూటింగుతో బిజీ. వినాయక్‌ సహా పలువురు దర్శకులు వినిపించిన కథలకు ఓకే చెప్పారు. కాబట్టి వెంకీ హోస్ట్‌ గా ఫైనల్‌ అన్న దాంట్లోనూ ఏ క్లారిటీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here