భూంఫట్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): భూరి కార్డుల నవీకరణపేరుతో మొదలుపెట్టిన కార్య క్రమం కాస్తా లక్షలాది మంది పేదల కడుపు కొట్టింది. 2007లో రాష్ట్రంలో మొదలుపెట్టిన భూప్రక్షాళన కింద 72.1 లక్షల ఖాతాలున్నట్టు ధృవీకరించారు. అయితే రైతుబంధు పథకం కింద ఓ ప్రణాళికంటూ లేక ఇష్టం వచ్చినట్లుగా డబ్బు పంపిణీ చేయడంతో కొన్ని ఖాతాలు వివాదాస్పదమయ్యాయి. అలాంటి వివాదాస్పద ఖాతాలు 4.2 లక్షలున్నట్లుగా తెలుస్తోంది. కానీ నేటికీ వాటిని పరిష్కరించలేదు. ఇంకా పోతే 2.9 లక్షల పాసుపుస్తకాలు ఇంకా ఇవ్వవలసి ఉంది. వారికి రైతుబంధు పథకం కింద మొదటిసారిగా చెక్కులు అందినప్పటికీ, నేటికీ పాసుపుస్తకాలు జారీచేయనందున అనర్హులుగా తేల్చేసింది అధికారగణం. మొత్తంగా 4.9 లక్షల ఖాతాలకు రైతుబంధు పథకం ఆగిపోయింది. భూగరిష్ట పరిమితి చట్టాన్ని పట్టించుకోకుండా తనకు వందల ఎకరాలున్నాయని పేర్కొనేవారి ఖాతాలకూ చెక్కులందాయి. ఇలా ప్రజాధనం దుర్వినియోగమైపోయింది.

అయితే, ఈ భూరికార్డుల నవీకరణ పేరుతో కెసీయార్‌ వ్యూహమంతా సమగ్ర కుటుంబ సర్వేలాంటిదేనని విశ్లేషకులు వాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ (భూరికార్డులకు) సంబంధించి గతంలో ఉన్న ”మాభూమి” వెబ్సైట్‌ బాగానే పనిచేసింది. అందులో ఫీల్డ్‌ మెజర్మెంట్‌ బుక్‌ కూడా పొందుపరిచారు. అయితే, అర్థంతరంగా ”మాభూమి” వెబ్సైట్‌ నిర్వహణను ఆపేసి, ఆ వెబ్సైటే ప్రజలకు అందుబాటులోలేకుండా చేసి, ఇప్పటికే దివాళాతీసిన న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ డ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ (ఐయల్‌ డ ఎఫ్‌ఎస్‌) కంపెనీకి రూ.116.05 కోట్లతో ”ధరణి” ప్రాజెక్టు పేరిట భూరికార్డుల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంవెనక ప్రభుత్వపెద్ద ఉన్నట్టు తెలిసింది. అసలు ఏ ప్రాతిపదికన ఐయల్‌ డ ఎఫ్‌ఎస్‌ అనే దివాళాతీసిన సంస్థకు భూరికార్డుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారో తెలపాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాము. డిసెంబర్‌ 23, 2015న సెక్షన్‌ 22-ఎ భూముల విషయంలో తీసుకోవాల్సిన చర్యలుపేర్కొంటూ గౌరవ హైకోర్టు ముఖ్య కార్యదర్శి (రెవెన్యూ), సంచాలకులు (సర్వే సెటిల్మెంట్‌ డ ల్యాండ్‌ రికార్డులు), రిటైర్డ్‌ జిల్లా కోర్టు జడ్జి గారితో ఓ కమిటీ ఏర్పాటుచేయమని చెప్పినప్పటికీ నేటికీ అతీగతీ లేదు. ఆయా సాగునీటి ప్రాజెక్టుల్లో 22-ఎ భూములకు ఎంజాయ్మెంట్‌ సర్వే పేరిట అనర్హులకు కూడా పరిహారం చెల్లించారని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ప్రభుత్వ భూములను అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. శంషాబాద్‌ మండలంలో తన అనుంగు మిత్రుడికి అనుకూలంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో జారీచేసారని ఆరోపించారు. అలాగే కాప్రా మండలంలోని ఎవాక్యూ భూముల రికార్డులు చెరిపివేసి భవన నిర్మాణ అనుమతులిచ్చారని తెలిసింది. ఒక్క యాదాద్రి మండలంలోనే వారం రోజుల్లో ప్రభుత్వాధినేత కుమార్తౌె బినావిూల పేరిట 550 ఎకరాలు కొనుగోలు చేసారని, నోట్ల రద్దు సమయంలో వికారాబాద్లో పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు. అనేక చోట్ల ప్రభుత్వ భూముల్లో టీఅర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు పాగావేసిన సందర్భాలున్నాయని, సాదాబైనామల పేరిట కూడా అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ రకంగా ప్రజలు అధికారులచుట్టూ తిరిగేలా, చివరకు న్యాయంకొరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా ప్రజలను ఇబ్బందులకుగురిచేస్తున్నారని కేసీయార్పై దుమ్మెత్తిపోసారు నన్నూరి నర్సిరెడ్డి. మొత్తవ్మిూద సమస్త భూసమాచారం చేతపట్టుకోని నయా భూదందాకు తెరదీసాడు కెసీయార్‌. ఇక నయీం భూముల సంగతి అటకెక్కించాడు.

సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్‌ 4 ప్రకారం స్వచ్చంధంగా వెల్లడించాల్సిన సమాచారాన్నీ దాచిపెడుతున్న ఈయన, ఈయన కుమారుడు ఇక పారదర్శక పాలన అందిస్తారంటే ఎట్లా నమ్మేది? వేల జీవోలు రహస్యంగా ఉంచి, సాక్షాత్తు ఐటీ శాఖా మంత్రి కేటీయార్‌ తన శాఖలో జరుతున్నవాటిని రహస్యంగాఉంచితే ఏమనుకోవాలి? ఐటీ శాఖలో వేల కోట్ల పనులు నామినేషన్‌ విూద నచ్చినోడికిచ్చుకునే ఆయన అవాకులు చవాకులు పేలటానికి మాత్రం ముందుంటాడు.

కాబట్టి, వెంటనే 2014 జూన్‌ 2 నుండి నేటి వరకు ప్రభుత్వం జారీచేసిన అన్ని జీవోలు, సర్క్యులర్లు వెబ్సైట్లో అప్లోడ్‌ చేసి ప్రజలు తెలుసుకునేవిధంగా అందుబాటులోఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అలాగే అప్పటి మాభూమి వెబ్సైట్ను కూడా స్టాండ్బైగా అందుబాటులోకి తేవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ను, సమాచార హక్కు చట్టం సరిగ్గా అమలయ్యేలా చూడాలని సమాచార కమిషన్ను కోరుతున్నామని తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here