భక్తాద్రిగా మారిన భద్రాద్రి

0
  • రామభక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభ
  • మిథిలా స్టేడియంలో చలువు పందిళ్లు
  • భద్రాద్రి రాముడికి పట్టువస్త్రాలు..
  • భక్తులకు ముత్యాల తలంబ్రాలు
  • కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం

దక్షిణ భారత అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరి రామనామ స్మరణతో మార్మోగింది. సీతారాముల కల్యాణం ఆద్యంతం కమనీయంగా సాగింది. భక్తజన సందోహంతో గోదారమ్మ పులకించింది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులతో కరకట్ట కళకళలాడింది. కల్యాణ మండపమైన మిథిలాస్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. పురోహితుల వేదమంత్రోశ్చరణలు, భక్తుల రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ జగదభి రాముని కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. లోక కల్యాణాన్ని తిలకించిన భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయింది. స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కల్యాణాన్ని తిలకించారు.

శ్లో|| …శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

భద్రాద్రి భక్తజనాద్రిగా మారింది. భూదేవంత అరుగు విూద, ఆకాశమంత పందిరిలో జగదభిరాముడి జగత్‌ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శిల్పకళా శోభితమైన మిథిలానగరం కళ్యాణ మండపంలో రామయ్య సుగుణాల రాశి సీతమ్మను పరిణయమాడారు. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామ నవమి సందర్భంగా దక్షిణాది అయోధ్య భద్రాచలం సప్తవర్ణ శోభితమై మెరిసిపోయింది. శిల్పకళా శోభితమైన మిథిలానగరం కళ్యాణ మండపంలో అభిజిత్‌ లగ్నంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య దశరథ తనయుడు శ్రీరాముడు.. జనక మహారాజు కుమార్తె సీతమ్మను వివాహమాడారు. శ్రీ సీతారాముల కల్యాణాన్ని కళ్లారా వీక్షించడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణ క్రతువులో ఒక్కో ఘట్టాన్ని వివరిస్తూ అర్చక పండితులు రాముల వారి వివాహ మ¬త్సవాన్ని నిర్వహించారు. తొలుత ఆలయంలో ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించిన తర్వాత.. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా సీతారాములు పల్లకీలో కల్యాణ మండపానికి వేంచేశారు. వేదపండితులు తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికి విష్వక్సేనుని పూజించారు. మంత్రోచ్చారణలతో మధ్య యజ్ఞోపవేతధారణ జరిగింది. పండితులు రాములవారికి సాధారణ యజ్ఞోపవేతంతో పాటు బంగారుయజ్ఞోపవేతధారణ గావించారు. చైత్రశుద్ధ నవమి అభిజిత్‌ లగ్న సుముహుర్తాన జానకీరాముల కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామాలయంలోని మిథిలా ప్రాంగణంలో జరిగిన రాములోరి లగ్గానికి భక్తజనులు పోటెత్తారు. సీతారాముల కల్యాణం కనులారా వీక్షించి జన్మధన్యమైనట్లుగా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవానికి అధికార యంత్రాంగం విస్తత ఏర్పాట్లు చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాములోరి కల్యాణానికి పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో.. భద్రాద్రి ఆలయం కిటకిట లాడింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగేలా మిథిలా ప్రాంగణంలో కూలర్లు, ఫ్యాన్లు సమకూర్చారు. నో సౌండ్‌, నో పొల్యూషన్‌.. హైదరాబాద్‌ రోడ్లపైకి మరో 60 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రతి యేటా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణం వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈసారి భక్తుల రద్దీని ద ష్టిలో పెట్టుకుని దాదాపు 3 లక్షల మేర లడ్డూలను సిద్ధం చేశారు ఆలయ అధికారులు. తలంబ్రాల పంపిణీకి 34 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు. మిధిలా ప్రాంగణం వేదికగా సుందర, సుమధురు ద శ్యకావ్యం ఆవిష్క తమైంది. పావన గోదావరి తీరాన కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం జరిగింది. నుదిటిన కల్యాణ తిలకం, బుగ్గన దిష్టిచుక్కతో సీతమ్మ సిగ్గుల మొగ్గ కాగా.. సర్వాభరణ భూషితుడైన రామయ్య పెళ్లి మండంపంలో ఆసీనులయ్యారు. వేద మంత్రోచ్చారణలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జగదభిరాముడు సీతమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశాడు.

తొలుత ధ్రువమూర్తుల కల్యాణం

భద్రాద్రిలో తొలుత ధ్రువమూర్తుల కల్యాణం అనంతరం కల్యాణమూర్తుల అలకారం జరిగింది. బాజా భజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణమూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. జానకీదేవిని శ్రీరాముని ఎదుట కూర్చోబెట్టి రక్షా బంధనం, మోక్ష బంధనం అనంతరం 24 అంగుళాల పొడవున్న 12 దర్బలతో అల్లిన దర్బతాడును సీతమ్మ నడుముకు కట్టారు. వధూవరులిద్దరికీ రక్షా సూత్రాలు కట్టి స్వామివారి గ హస్థాశ్రమ సిద్ధి కోసం సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు.

అభిజిత్‌ లగ్నంలో జిలకర బెల్లం

కన్యావరణం అనంతరం స్వామివారికి పాద ప్రక్షాళన చేసి పరిమళ భరిత తీర్థంతో మంత్రోక్తంగా పుష్పోదక స్నానం చేయించారు. గోదానం చేసి మహా సంకల్పం పఠించి వరపూజ నిర్వహించారు. అనంతరం జగత్‌ కల్యాణార్థం సాక్షాత్‌ విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడికి శ్రీ మహాలక్ష్మి రూపైన సీతమ్మను కన్యాదానం చేశారు. అభిజిత్‌ లగ్నం సమీపించగానే మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా.. సీతారాముల జిలకరబెల్లం క్రతువు పూర్తి చేశారు. ఆ తర్వాత తొమ్మిది పోగులతో మూడు సూత్రాలతో మంగళసూత్రాన్ని రూపొందించి సీతమ్మ మెడలో రామయ్యతో మూడు ముళ్లు వేయించారు.

గోటితో ఒలిచిన తలంబ్రాలు

భద్రాద్రి రాముడికి ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాంగళ్యధారణ అనంతరం జరిగిన తలంబ్రాల ఘట్టం నయనానందకరంగా సాగింది. ముత్యాలతో పాటు గోటితో ఒలిచిన తలంబ్రాలతో ఈ తంతు నిర్వహించారు. అనంతరం దాంపత్య బంధానికి ప్రతీకగా జానకీరాములకు బ్రహ్మ బంధనం (బ్రహ్మముడి) వేసిన అర్చకులు నవ వధూవరులతో బంతి ఆట ఆడించారు. కర్పూర నీరాజనం సమర్పించి ఆశీర్వచనంతో కల్యాణ క్రతువు పూర్తి చేశారు.

భారీగా తరలివచ్చిన భక్తులు

సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోదండరాముని వివాహం కనులారా చూసి తరించిపోయారు. అధికారుల ఏర్పాట్లపై భక్తులు సంతప్తి వ్యక్తంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here