ముస్తాబైన భద్రాద్రి

0
  • సీతారామ కళ్యాణానికి ఏర్పాట్లు
  • నేడు ఎదుర్కోలు ఉత్సవాలు
  • ఆదివారం కళ్యాణం.. సోమవారం పట్టాభిషేకం

భద్రాచలం : భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి బ్ర¬్మత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ, ఆదివారం శ్రీసీతారామ చంద్రస్వామి తిరుకల్యాణోత్సవం, సోమవారం శ్రీసీతారామచంద్రస్వామి మహా పట్టాభిషేకోత్సవం జరగనున్నాయి.ఈ మేరకు భారీ ఏర్పాట్లుచేశారు. రామయ్య పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలం రామాలయం మిథిలా మండలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చలువ పందిళ్లు, పంకాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. భద్రాద్రి ఆధ్యాత్మిక సంద్రంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు కల్యాణం అప్పారావు నేతృత్వంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను భద్రాచలం తీసుకుని రానున్నారు. బుధవారం అక్కడ ప్రత్యేక పూజలు చేసి వానర వేషధారణలో ఉన్న భక్తులు శ్రీరామ నామాలను పఠించారు. దాదాపు 200 మంది ప్రత్యేక వాహనాలలో వచ్చి పండుగ వరకు ఇక్కడే ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 11న పాదయాత్రగా ఐదారు వేల మంది బయల్దేరాన్నారు. చాలాకాలం నుంచి వీళ్లు ఈ తరహా భక్తిని చాటుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి భజన బృందాలు భారీ సాయిలోనే రానున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భక్తులు 100 క్వింటాళ్ల బియ్యాన్ని స్వామివారికి సమర్పించగా దర్శనానికి వస్తున్నారు. విజయవాడకు చెందిన భక్తులు అన్నదానం చేయనున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది స్వామి కార్యంలో సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

వేములవాడలో నేడు కళ్యాణం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీ సీతారాముల కల్యాణం జరగనుంది. హరహర క్షేత్రం శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కల్యాణ్యోత్సవం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు స్వామివారికి ఎదుర్కోలు, ఉదయం 9:50 గంటల నుంచి శ్రీసీతారామ కల్యాణ క్రతువు, సాయంత్రం 4:20 గంటలకు స్వామివారి రథోత్సవం, రాత్రి 7:30 గంటలకు స్వామివారి డోలోత్సవం నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here