తిరుగుబాటు అభ్యర్థులపై రంగుపడింది!

0

24 మంది నేతలపై వేటు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తిరుగుబాటు అభ్యర్థులపై కాంగ్రెస్‌ పార్టీ కొరడా ఝళిపించింది. 24 మందిపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 24 మందిపై కాంగ్రెస్‌ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వారందరినీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ కోదండరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాబితాను విడుదల చేశారు. వీరిలో 19 మంది నియోజకవర్గ స్థాయి నేతలు ఉన్నారు. రవి శ్రీనివాస్‌ (సిర్పూర్‌), బోడ జనార్దన్‌ (చెన్నూరు), హరినాయక్‌ (ఖానాపూర్‌), అనిల్‌ జాదవ్‌ (బోథ్‌), నారాయణరావు పాటిల్‌ (ముథోల్‌), అరుణతార (జుక్కల్‌), ఆర్‌.రత్నాకర్‌ (నిజామాబాద్‌), గణేశ్‌ (సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌), కె. శివకుమార్‌ రెడ్డి (నారాయణపేట), ఇబ్రహీం (మహబూబ్‌నగర్‌) సురేందర్‌ రెడ్డి (మహబూబ్‌నగర్‌) , కేతావత్‌ బిల్యా నాయక్‌ (దేవరకొండ) పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ రెడ్డి (మునుగోడు) డాక్టర్‌ రవికుమార్‌ (తుంగతుర్తి), మాలావత్‌ నెహ్రూ నాయక్‌ (డోర్నకల్‌) ఊకె ఊబయ్య (ఇల్లెందు), బానోత్‌ బాలాజీ నాయక్‌ (ఇల్లెందు), ఎడవల్లి క ష్ణ (కొత్తగూడెం), రాములు నాయక్‌ (వైరా)లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. వీరిలో పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేసినవారు కొందరైతే.. మరికొందరు ఇతర పార్టీలకు మద్దతు పలుకుతు న్నారని డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన నివేదికపై చర్చించి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అలాగే నారాయణపేట నియోజకవర్గానికి చెందిన మరో ఐదుగురిని కూడా పార్టీ సస్పెండ్‌ చేస్తూ మరో జాబితాను విడుదల చేశారు. వీరందరినీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్‌ క్రమశిక్షణా సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మ కంగా తీసుకున్న కాంగ్రెస్‌ కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి చిన్న అంశంపైనా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగం గానే పలు నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశించి భంగపడిన వారిని బుజ్జగించి వారిలో చాలామంది నామినేషన్ల ఉపసంహరిం చుకొనేలా చేయడంలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here