కళ్ళు తెరవక ముందే .. బాబుని కడతేర్చిన తల్లి

0

బంటారం లో బాలుడి దారుణ హత్యచనిపోయాడని వీధిలో విసిరేసిన కుటుంబీకులు స్థానికుల సమాచారంతో ఆస్పత్రికి తరలింపు… చికిత్స పొందుతూ మృతి కేసు నమోదు చేసిన బంటారం పోలీసులువికారాబాద్ ఆదాబ్ హైదరాబాద్.అక్రమ సంబంధంతో పుట్టిన బిడ్డ నో… లేక కుటుంబ కలహాల కారణం తెలియదు కానీ నిన్న రాత్రి పుట్టిన పసికందు ను హత్య చేసి వీధుల్లో విసిరి వేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బంటారం మండల కేంద్రంలో  జరిగింది వివరాల్లోకెళ్తే…. నిన్న రాత్రి పుట్టిన పసికందును ఎవరో గుర్తుతెలియని కసాయి తల్లి దారుణంగా హత్య చేసి వీధుల్లో విసిరి వేసింది పురిటిలో బొడ్డు పేగు కూడా కోయని ఒకరోజు బాబును కసాయి తల్లి దారుణంగా హత్య చేయడానికి ప్రయత్నించింది. గొంతు భాగంలో వాడైన ఆయుధంతో గొంతు కోసి చనిపోయాడని భావించి వీధిలోని చెత్తకుండీలో విసిరేశారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అభం శుభం తెలియని బాబు ను స్థానికులు గుర్తించి బంటారం పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు బాలుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన తాండూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని నీలోఫర్ ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాబు మృతి చెందాడు బంటారం పోలీసులు హత్య కేసు కింద నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా బాబు గొంతుపై గాయాలు ఉన్నట్లు తాండూర్ సివిల్ ఆస్పత్రి డాక్టర్లు గుర్తించారు ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో వారు దర్యాప్తు ముమ్మరం చేశారు కాగా అంగన్వాడి సూపర్వైజర్ జ్యోతి అంగన్వాడి టీచర్లు బాబు తల్లి కోసం ఆరా తీస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసిన గర్భిణీ స్త్రీల వివరాలు సేకరించి ఏ మహిళ పురుడుపోసుకుంది అని ఇంటింటా తిరిగి వివరాలు సేకరిస్తున్నారు త్వరలోనే కసాయి తల్లిని గుర్తించే అవకాశం ఉంది ఈ సంఘటనపై పై బంటారం ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు మానవత్వం లేని తల్లిపై కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here