అందమైన ఈ సరస్సు గురించి తెలుసుకోవాల్సిందే.

0

ప్రపంచంలో అనేక సరస్సులున్నాయి. కానీ న్యూజిలాండ్‌లో బ్లూ లేక్ (నీలం రంగు సరస్సు) చాలా ప్రత్యేకమైంది. అద్భుతమైంది. ఇంతకీ ఆ సరస్సుకు సంబంధించిన విశేషాలేమిటంటే..

న్యూజిలాండ్‌లోని మౌంట్ ఫ్రాంక్లిన్‌కు సమీపంలో ఉంటుందీ సరస్సు. న్యూజిలాండ్ సౌత్ ఐస్‌ల్యాండ్‌లో ఉన్న ఈ సరస్సు ప్రపంచంలోనే పరిశుభ్రమైందిగా గుర్తింపు పొందింది. అంతే కాదు స్థానిక ప్రజలు, ప్రభుత్వం దీనిని ఒక పవిత్రమైన ప్రదేశంగానూ భావిస్తారు. ఇందులోని నీరు ఎంత చల్లగా ఉంటుందంటే, ఒక వెట్‌సూట్ ధరించకుండా అడుగు పెట్టలేనంత. సరస్సు అందాలను కెమెరాల్లో బంధించకుండా ఉండలేరు. ఈ సరస్సులో కనిపించే అద్భుతమైన దృశ్యాల్లో ఒకటి.. నీటిపై పరావర్తనం చెందే రకరకాల రంగులు. చూపరులను కనులవిందు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సరస్సులో ఈత కొట్టడం నిషేధం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here