అప్రమత్తంగా ఉండండి

  0

  • సహాయకచర్యలు ముమ్మరం చేయండి
  • ఫొని తుఫాన్‌ ప్రభావంపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం

  న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఫొని తుఫాన్‌ దూసుకువస్తున్న నేపథ్యంలో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. గురువారం ఫొని తుఫాన్‌ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తుఫాన్‌ వేళ ఎదుర్కోవాల్సిన అంశాలపై ఆయన ఢిల్లీలో సమావేశం చేపట్టారు. క్యాబినెట్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అడిషనల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ¬ం సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు ఐఎండీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఎంఏ, పీఎంవో అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఫొని తుఫాన్‌.. చిలక, పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే అక్కడ బలమైన గాలులు వీస్తున్నాయని, తీరం వెంట ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని తెలిపారు. దాదాపు అయిదేళ్ల తర్వత ఓ భారీ తుఫాన్‌ ఒడిశా తీరాన్ని తాకుతుందని, ఫొని తుఫాన్‌ నేపథ్యంలో తూర్పు నౌకాదళం అప్రమత్తమైందని ప్రధానికి వివరించారు. ఏప్రిల్‌ 25వ తేదీ నుంచే ఒడిశా తీరాన్ని పెట్రోలింగ్‌ చేస్తున్నట్లు కోస్టు గార్డు ఐజీ పరమేశ్‌ తెలిపారు. జాలర్లకు వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు చేశామన్నారు. 8రెస్క్యూ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. విశాఖ, చెన్నైలో భారీ షిప్‌లు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రిలీఫ్‌ వర్క్‌ కోసం హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఒడిశాపై పడుతుందని, ఒడిశాలోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తుఫాన్‌ తీరం దాటాక తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో వేగవంతంగా సహాయక చర్యలు నిర్వహించాలని, ఎలాంటి ప్రాణ నష్టం ల లేకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ప్రధాని మోడీ ఆదేశించారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here