Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

సెప్టెంబర్‌15 నాటికి బతుకమ్మ చీరలు

సిరిసిల్లలో 40.50కోట్ల మీటర్ల క్లాత్‌కు ఆర్డర్‌ ఇచ్చాం

  • 64 ఎకరాలలో రూ. 175కోట్లతో అపెరల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాం
  • సిరిసిల్ల ఒక తిర్పూర్‌ స్థాయికి చేరుకోవాలి
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల

సెప్టెంబర్‌ 15 నుంచి బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్‌.. మాట్లాడారు.. కోటి మంది మహిళలకు సెప్టెంబర్‌ 15 నాటికి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు పోతున్నాయన్నారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలోని నేతన్నలకు గణనీయమైన మద్దతు, గౌరవం, భద్రతతో కూడిన జీవనోపాధిని కల్పించామని చెప్పారు. సిరిసిల్లలో 40 కోట్ల 50 లక్షల మీటర్ల క్లాత్‌కు ఆర్డర్లిచ్చామని.. దీంతో ఎనిమిది నెలలపాటు నేతన్నలకు ఉపాధి పెరిగిందని కేటీఆర్‌ చెప్పారు. 808 మంది నేతన్నలకు ఐదు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని కేటీఆర్‌ చెప్పారు. 10 శాతం యారన్‌పై సబ్సిడీ ద్వారా ప్రభుత్వంపై తొమ్మిది కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. కార్మికుల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి రూ. 380 కోట్లు వెచ్చిస్తామని, 72 ఏళ్లలో భారతదేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం చేతుల మీదుగా సిరిసిల్లలో ప్రారంభిస్తామన్నారు. సిరిసిల్లలో వీవింగ్‌ పార్కుకు బీజం వేస్తామన్నారు. 64 ఎకరాలలో రూ. 175 కోట్లతో అపెరల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, అందులో పదివేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. చేనేత రంగానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. 11 వేల మంది నేత కార్మికులకు రుణమాఫీ చేశామని, సిరిసిల్లలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ వల్లే నేత కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close