Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

పంచాయతీ పోరుకు ‘బ్యాలెట్ ‘ సిద్ధం

(పరమాత్మ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా సుమారు 2.5 కోట్ల బ్యాలెట్‌ పత్రాలను అధికారులు తెలంగాణ జిల్లాలకు పంపారు. వచ్చిన పత్రాల్లో క్రమ సంఖ్య, గుర్తుల ముద్రణ, పత్రాలు చినిగిపోవడం తదితర అంశాలను పరిశీలించి సక్రమంగా లేనివాటిని తొలగించే ప్రక్రియను జిల్లా అధికారులు నిర్వహిస్తున్నారు. సర్పంచి బ్యాలెట్‌ పత్రాల్లో 2ం1 నుంచి 11ం1 వరకు గుర్తులు ముద్రించారు. వార్డు సభ్యుల బ్యాలెట్‌ పత్రాల్లో 2ం1 నుంచి 7ం1 వరకు గుర్తులు ముద్రించి

సిద్ధం చేశారు. సర్పంచి, వార్డు సభ్యుని బ్యాలెట్‌ పత్రంలో చివర నోటా ఉంటుంది. ప్రతి బండిల్‌లో 50 పత్రాలు ఉంటాయి. నామినేషన్ల ఉపసంహరణ. అనంతరం పోటీలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యను అనుసరించి ఆయా సంఖ్యకు సరిపడ గుర్తులున్న పత్రాలను పంపిణీ చేయనున్నారు. 2 నుంచి 5 వరకు గుర్తులున్న బ్యాలెట్‌ పత్రాలను ఎక్కువ సంఖ్యలో ముద్రించారు. సర్పంచికి 11 మంది, వార్డు సభ్యునికి ఏడుగురి కంటే ఎక్కువ సంఖ్యలో పోటీ చేసినట్లయితే అక్కడికి ఆయా సంఖ్యకు సరిపడ గుర్తులతో బ్యాలెట్‌ను ముద్రించనున్నారు.

ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌: పంచాయతీ ఎన్నికలకు ఈసారి నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ సమర్పించే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో పూరించి, ప్రింట్‌ తీసి సంతకం చేసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పిస్తే సరిపోతుంది. అభ్యర్థులు అనుసరించాల్సిన నియమావళి, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా లభిస్తుంది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను సైతం అప్‌ లోడ్‌ చేయనున్నారు. పోటీచేసే అభ్యర్థులకు, ప్రజలకు అవసరమైన సమాచారం మొత్తం వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నామినేషన్లు, అఫిడవిట్ల పత్రాలన్నింటినీ స్కాన్‌ చేసి నమోదు చేయాలని మండల అధికారులకు సూచించారు. ఎన్నికలు ముగిసిన రోజు ఫలితాలను వెబ్‌ సైట్‌లో ఉంచనున్నారు. ఏ జిల్లాలో, ఏ గ్రామంలో ఎవరు గెలిచారు.? అనే విషయం ఎక్కడి నుంచైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

గులాబీ, తెలుపు రంగుల్లో.. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపమోగించగా.. జరగనున్న ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలను వినియోగించనున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక ఓటరు సర్పంచికి ఒకటి, వార్డు సభ్యుడికి మరోకటి కలిపి రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఓటర్లకు అందజేసే బ్యాలెట్‌ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి.

సర్పంచి అభ్యర్థులవి గులాబీ, వార్డు సభ్యులవి తెలుపు రంగుల్లో ఉంటాయి. ఈ పత్రాల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఉంటాయి. పత్రం చివరిలో నోటా గుర్తు ఉంటుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల నిర్వహణ జరుగుతున్నందున ఆయా పార్టీలకు చెందిన గుర్తుల కేటాయింపు జరుగదు.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close