డేరా బాబాకు బెయిల్

0

★ జైలుశిక్ష కారణంగా జైలులోనే

(పంచకుల, ఆదాబ్ హైదరాబాద్):అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షపడిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు ‘కేస్టరేషన్’ కేసులో పంచకుల సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డేరాబాబా తన ఆశ్రమంలోని సుమారు 400 మంది భక్తులను సపుంసకులను చేసే శస్త్రచికిత్సలు చేయించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసులోనే ఆయనకు కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ…అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలుశిక్ష పడటంతో డేరాబాబా జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఆశ్రమంలోని 400 మంది మగ భక్తులను నపుంసకులుగా చేసే శస్త్రచికిత్సలు జరిగాయంటూ గతంలో డేరా బాబా అనుచరుడుగా ఉన్న బాధితుడు ఒకరు 2012లో పంజాబ్, హర్యానా ఉమ్మడి కోర్టును ఆశ్రయించారు. దీంతో 2014లో ఉమ్మడి కోర్టు ఆదేశాల మేరకు రామ్ రహీమ్, మరో ఇద్దరు డాక్టర్లు పంకజ్ గార్గ్, ఎంపీ సింగ్‌లపై ‘కాస్టరేషన్’ కేసును సీబీఐ నమోదు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here