Featuredజాతీయ వార్తలు

బెంగాల్‌ నుంచి ‘బచావ్‌ బచావ్‌’ కేకలు

సిల్వస్సా : ‘మహాకూటమి’ మోదీకి వ్యతిరేకం కాదని, దేశ ప్రజలకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని సిల్వస్సాలో శనివారం జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా టీఎంసీ ఆధ్యర్యంలో కోల్‌కతాలో జరుగుతున్న విపక్షాల ఐక్య ర్యాలీపై విమర్శలు గుప్పించారు. విపక్షల నేతలంతా సహజంగా చేతులు కలిపిన వారు కాదని, ఇప్పటికే ఎవరి వాటాలు వారు మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిపై తాను తీసుకున్న చర్యలు కొందరికి ఆగ్రహం తెప్పించాయని, ప్రజాధనాన్ని లూటీ చేయకుండా వారిని తాను అడ్డుకోవడమే వారి ఆగ్రహానికి కారణమని అన్నారు. ఆ క్రమంలోనే వారంతా ‘మహాకూటమి’గా ఏర్పడేందుకు వెంపర్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ సత్తా చూసి ప్రాంతీయ పార్టీలన్నీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని, దిక్కుతోచక సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ, బచావ్‌ బచావ్‌ అంటూ కోల్‌కతా వేదిక నుంచి కేకలు పెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే వారంతా ఒక్కటయ్యారని, ఐక్యకూటమిగా పిలుచుకుంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తే, తాము కేవలం ఐదేళ్లలో 1.25 కోట్ల ఇళ్లు పేదలకు కట్టించామని మోదీ చెప్పారు. దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసని, నాలుగున్నరేళ్లలో ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూసేలాచేశామని మోదీ అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను, అన్ని మతాల ప్రజలను సమానంగా చూస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నది ఒక్క భాజపా ప్రభుత్వమేనని మోదీ స్పష్టం చేశారు.

కే9 వజ్రా యుద్ధ వాహనాన్ని నడిపిన మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యుద్ధ ట్యాంక్‌ను నడిపారు. కే9 వజ్రా ¬విజర్‌ గన్‌ను ఆయన స్వయంగా నడిపారు. లార్సన్‌ అండ్‌ టార్బో సంస్థ దాన్ని నిర్మించింది. గుజరాత్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. అక్కడ కే9 వజ్రా యుద్ద వాహనాన్ని ఆవిష్కరించారు. రానున్న 42 నెలల్లో మొత్తం 100 హవిజర్‌ గన్‌లను కొనేందుకు రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. సూరత్‌కు 30 కిలోవిూటర్ల దూరంలో ఉన్న హజిరాలో ఆర్మర్డ్‌ సిస్టమ్స్‌ కాంప్లెక్స్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలోనే కే9 వజ్రా టీ155ఎంఎం-52 క్యాలిబర్‌ ట్రాక్డ్‌ సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ ¬విజర్‌ గన్నులను తయారు చేస్తున్నారు. 
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close