ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటేనే.. బాబుకు వణుకు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి దానిని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు వణుకు పడుతుందని, అందుకే మతిభ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, సనత్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. గురువారం తలసాని అసెంబ్లీ విూడియాపాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబులాగా దేవాలయాల వద్ద రాజకీయాలు చేసే అలవాటు నాకు లేదన్నారు. నాకు అక్కడ బంధువులు ఉన్నారని, బంధుత్వాలు, బంధాల విలువ చంద్రబాబుకు తెలియదన్నారు. హరికృష్ణ చనిపోతే అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడిన నీచమైన సంస్కృతి చంద్రబాబుదన్నారు. నేను మొన్న ఏపీకి వచ్చినందుకు బాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఇలాగే హెచ్చరికలు చేస్తే బీసీలెవరూ టీడీపీలో ఉండరని, ఈ దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో..

ఫెడరల్‌ ఫ్రంట్‌ వేదికగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, నాయకులను కేసీఆర్‌ కలుస్తున్నారన్నారు. దీంతో బాబుకు వణుకు పుట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తలసాని విమర్శించారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తే సమాధానం తీవ్రంగా ఉంటుందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబేననన్నారు. మాల,మాదిగలకు, బీసీలకు, కాపులకు గొడవ పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అలాంటి చంద్రబాబు టీఆర్‌ఎస్‌ పార్టీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ బాబు మాకొద్దు అనే నినాదంతో ముందుకు పోతున్నామని ఆంధ్రా ప్రజలు చెప్పారని, ముసుగు తీసిన దొంగలు విూరు.. ఆ నాటకాలేంటో బయటపెడుతామని తలసాని హెచ్చరించారు. చంద్రబాబుకు టైం దగ్గరపడ్డదన్నారు. ఎన్టీఆర్‌ అభిమానులే చంద్రబాబును సాగనంపాలని చూస్తున్నారని తలసాని పేర్కొన్నారు. నేను వందశాతం రాజకీయాలు మాట్లాడుతానని, ఏపీలో తప్పకుండా రాజకీయాలు చేస్తానని, అక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్లున్నారన్నారు. నేను ఆంధ్రాలో బీసీ నాయకులను కలిస్తే చంద్రబాబుకు భయం పుట్టుకుందని తలసాని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారన్నారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందని, నేను ఏపీకి వెళ్తే ఆ స్థాయిలో ప్రజాస్పందన ఉంటే.. మా సీఎం కేసీఆర్‌ వెళ్తే ఏ రేంజ్‌లో స్పందన ఉంటుందో ఊహించుకోండి అని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ప్రతీ విషయంలోనూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, రాజకీయాలు మాని రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడేలా కృషి చేయాలని సూచించారు. తెలంగాణలోని ఆంధ్రాప్రజలను మేం కాపాడుకుంటామన్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేయలేదా అని తలసాని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలు విసిగిపోయి మిమ్మల్ని తిరస్కరించారని అన్నారు. ఏపీలో అభివృద్ధిని మేం అడ్డుకుంటున్నామని చంద్రబాబు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఏపీలో చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని మాట్లాడుతున్నారని, చంద్రబాబు లేకపోయినా అభివృద్ధి జరుగుతూనే ఉంటేందని, గతంలో నువ్వు అధికారంలో లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఆగిందా అని ప్రశ్నించారు. చిల్లర రాజీయాలు మానుకోకపోతే తెలంగాణ ప్రజలు తరిమికొట్టినట్లు ఏపీ ప్రజలు నిన్ను తరిమేస్తారని తలసాని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here