హరీశ్‌ని దెబ్బతీయడమే బాబు లక్ష్యం

    0

    హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హరీష్‌ రావు ఈ పేరు తెలియని వారు ఉండరు హరీష్‌ అంటే పేరు కాదు ఒక నమ్మకం ఆపదలో ఆదుకునే నాయకుడు ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు. రాష్ట్రంలో హరీష్‌ ఎక్కడికి వెళ్ళిన అది జన ప్రబంజనమే నిత్యం ప్రజల మద్యలో ఉంది ప్రజల కోసం పరితపించే నాయకుడు పార్టీలో కూడా ట్రబుల్‌ షూటర్‌ గా పేరొందిన నాయకుడు ఎక్కడ ఎన్నికలు జరిగిన మేన మామ కేసిఆర్‌ ఆదేశాలతో అక్కడ వాలి పార్టీని గెలిపించే సత్తా కలిగిన నాయకుడు అసంతప్తు లను బుజ్జగించడంలో హరీష్‌కి ఎవరు సాటి రారు. సిద్దిపేట్‌ నుండి 5 పర్యాయాలు గెలిచి ప్రతిపక్షాలు అసలు సిద్దిపేట్‌ నుండి పోటీ చేయాలంటేనే బయపడేలా టిఆర్‌ఎస్‌ కి కొంచు కోటగా తీర్చిదిద్దాడు. సిద్దిపేట్‌ ఒక్క నియోజకవర్గమే కాదు కేసిఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ లో కూడా నిత్యం పర్యటిస్తూ మేన మామ కేసిఆర్‌ నమ్మిన బంటుగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ… కేసిఆర్‌ గెలుపుకోసం కషి చేస్తున్నాడు అలాంటి నిబద్దత కలిగిన నాయకుడిని తెలుగుదేశం కాంగ్రెస్‌ నాయకులు టార్గెట్‌ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది అదే చంద్రబాబు నీచ రాజకీయం ఇక్కడ గమ నించాల్సిన విషయంఏంటంటే హరీష్‌ మీద ఆరోపణలు చేస్తున్న నాయకులు తెలుగు దేశం నుండి కాంగ్రెస్‌ లోకి వలస వచ్చిన వారు తెలుగు దేశం నాయకులు వంటెరు ప్రతాప్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, రేవూరి ప్రకాష్‌ రెడ్డి అందరూ కాంగ్రెస్‌ నాయకులు వీళ్ళంతా చంద్రబాబు కను సన్నల్లో నడిచే నాయకులు కాంగ్రెస్‌ లో చేరినా ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాల ప్రకారం పని చేసే నాయకులు టిఆర్‌ఎస్‌ సగం బలం హరీష్‌ రావు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన కేసిఆర్‌ కి మొదటి నుండి అండగా ఉంటూ పార్టీ పటిష్టతకు హరీష్‌ కషి మరువలేనిది తెలంగాణ కోసం రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు ఒచ్చిన ప్రతి సారి హరీష్‌ టిఆర్‌ఎస్‌ నాయకుల గెలుపు తన బుజలపై వేసుకొని గెలిపించాడు. 2014 తరువాత జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో… టిఆర్‌ఎస్‌ పార్టీని తిరుగులేని శక్తి గా నిలబెట్టడంలో హరీష్‌ రావు పాత్ర వెలగట్టలేనిది 2015లో ఓటుకి నోటు కేస్‌ లో చంద్రబాబు కుట్రను బయట పెట్టడం లో హరీష్‌ కీలక పాత్ర పోషించాడు రేవంత్‌ రెడ్డి ని డబ్బుల బ్యాగ్‌ తో రెడ్‌ హాండెడ్‌ గా పట్టుకోవడం లో హరీష్‌ రావు పకడ్బందీ వ్యూహం రచించారు అది మనసులో పెట్టుకున్న చంద్రబాబు ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఓటు కు నోటు కేస్‌ ప్రతీకారం… అలాగే కేసిఆర్‌ కి హరీష్‌ మీద అపనమ్మకం కలిగిస్తే కేసిఆర్‌ హరీష్‌ ని దూరం పెట్టేస్తే అది పూర్తిగా టిఆర్‌ఎస్‌ పార్టీ మీద ప్రభావం చూపుతుంది.టిఆర్‌ఎస్‌ శ్రేణులు నిస్తేజులు అయ్యి మహాకూటమి గెలుస్తుంది అన్న దుర్బుద్దితో తెలుగు కాంగ్రెస్‌ నాయకులతో హరీష్‌ రావుని టార్గెట్‌ చేశారు. హరీష్‌ రావు తన మేనమామ కేసీఆర్‌ బరి లోకి దిగనున్న గజ్వేల్‌ నియోజకవర్గం పై మరింత ఫోకస్‌ చేశారు. తన నియోజకవర్గ ప్రచారాన్ని తన గెలుపు పై ఆత్మవిశ్వాసంతో వదిలేసిన హరీష్‌ రావు, తన మేనమామ కేసీఆర్‌ విజయం కోసం గజ్వేల్‌ లో పెద్దఎత్తున వ్యూహ ప్రతివ్యూహలతో పావులు కదుపుతున్నారు. దీంతో ఈ పోటీ హారీష్‌ వర్సెస్‌ వంటేరు అన్నతీరుగా మారిపోయింది. ఒంటెరు ప్రతాప్‌ రెడ్డి హరీష్‌ నాకు కాల్‌ చేశాడు అని చెప్తున్నాడు.. అన్నిటికి ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు కానీ ఆరోపణలు చేసి వారం అయిన బయట పెట్టడం లేదు. తాను ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేసి చెప్పగలనని అందుకు ఆయన హరీష్‌ సిద్ధమేనా? అంటూ సవాల్‌ విసిరారు. ఆధారాలు ఉంటే దేవుడ్ల ముందు ప్రమాణాలు ఎందుకు? అలాగే రేవూరి ప్రకాష్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌కు మెజార్టీ రాకపోతే హరీశ్‌ రావు పార్టీ మారతారని, హరీష్‌ కాంగ్రెస్‌ సపోర్ట్‌ తో సిఎం అవుతాడు అని అన్నారు.. కానీ పుట్టుక టిఆర్‌ఎస్‌ లో నే చావు టిఆర్‌ఎస్‌ లోనే అన్న హరీష్‌ మాటలు మర్చిపోయినట్టున్నాడు… ఇక రేవంత్‌ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది ఎందుకంటే ఎప్పటివరకు ఎన్నో ఆరోపణలు చేసిన రేవంత్‌ రెడ్డి ఏ ఒక్క దానికి ఆధారాలు మాత్రం చూపించలేదు.. కేవలం బట్ట కాల్చి మీద వేయడం మీరే నిరూపించుకోండి అన్నట్టు మాట్లాడడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటు ఇలాంటి వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ కేడర్‌తో పాటు ఆ పార్టీకి ఓటు వేసే వారిని కూడా గందరగోళంలో పడేస్తాయనే వ్యూహంతోనే చంద్రబాబు అండ్‌ కొ వ్యూహం పన్నింది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు హరీశ్‌ రావు టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌పై రాజకీయ దాడి చేయాలని చూస్తున్న చంద్రబాబుకి ప్రజలే తమ ఓటు తో బుద్ది చెప్పుతారని టిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here