గురక, దాని ప్రభావంపై అవగాహన శిబిరం

0

హైదరాబాద్‌: ప్రపంచ అగ్రగామి అనుసంధాన ఆరోగ్య సంస్థ అయిన రెస్‌ మెడ్‌ ఒక రోజు అవగాహన శిబిరం నిర్వహించింది. రెస్‌ మెడ్‌ అకాడమీ (రెస్‌ మెడ్‌ ఇండియా) క్లినికల్‌ హెడ్‌ డాక్టర్‌ భాస్కర్‌ ఆజాద్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురక, దాని ప్రభావం అనే అంశంపై ఈ శిబిరం జరిగింది. జిస్పాన్‌ (హైదరాబాద్‌) కు చెందిన 100 మందికి పైగా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రీయంగా మదింపు వేసే ప్రశ్నావళి ద్వారా సిబ్బందికి ప్రాథమిక స్క్రీనింగ్‌ నిర్వహించారు. వారి నిద్ర తీరుతెన్నులను ఆ ప్రశ్నావళి ప్రతిఫలించింది. ఈ విషయంలో సిబ్బందిలో మరింత అవగాహన పెంచేందుకు ఒక విద్యాత్మక కార్యక్రమం కూడా నిర్వహించారు. గురక పై అపోహలు, గురకతో మధుమేహానికి, స్థూలకాయానికి, గుండె వ్యాధులకు మధ్య ఉన్న సంబంధం గురించి అందులో చర్చించారు. ఈ సందర్భంగా జిస్పాన్‌ హెడ్‌ నారాయణ మూర్తి మాట్లాడుతూ, తమ సిబ్బందికోసం అవగాహన శిబిరం నిర్వ హించేందుకు రెడ్‌ మెడ్‌ తో కలసి పని చేయడం తమకెంతో ఆనందం అందించిందన్నారు. సిబ్బంది ప్రతి భావంతులుగా మాత్రమే గాకుండా ఆరోగ్యవంతులుగా కూడా ఉండాలని తమ సంస్థ కోరుకుంటుందని అ న్నారు. తగినంత నిద్రతో పాటు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా అవసర మన్నారు. ఆరోగ్యదాయక, సంతోషదాయక జీవితం గడిపేందుకు అవి ప్రధాన కారణాలుగా ఉంటాయన్నారు. రెస్‌ మెడ్‌ ఇండియా నేషనల్‌ మార్కెటింగ్‌ హెడ్‌ సీమా ఆరోరా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ”మన రోజువారీ పరంగా, ఆరోగ్యదాయక జీవితంపరంగా కూడా నిద్రపై అవగాహన ఎంతో ముఖ్యమైనా, దాన్నెవరూ అంతగా పట్టించుకోవడం లేదన్నారు. నిద్ర సంబంధ వ్యాధుల ప్రతికూల ఫలితాలపై ప్రజలకు అవగాహన ఉండడం లేదు. నాణ్యమైన జీవితం మెరగుపరుచుకునేందుకు గాను ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు నిద్ర గురించి అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు. రెస్‌ మెడ్‌ ఇండియా ప్రజలు, సాంకేతికత ప్రధానంగా పని చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ మరియు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవే ప్రధానాంశాలుగా ఉంటున్నాయి. రోజువారీగా రిమోట్‌ పేషెంట్‌ మానిటరింగ్‌ కు గాను 6 మిలియన్లకు పైగా క్లౌడ్‌ అనుసంధానిత ఉపకరణాలతో 100కు పైగా దేశాల్లో ఈ సంస్థ ఉనికి కలిగి ఉంది. గురక, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి ఉపకరణాలు, సాఫ్ట్‌ వేర్‌ పరిష్కారాలను ఈ సంస్థ అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here