అవతార్‌ నాలుగు సీక్వెల్స్‌ రిలీజ్‌ తేదీలు

0

దాదాపు పదేళ్ల క్రితం రిలీజైంది అవతార్‌ (2009). బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమా స ష్టించిన సంచలనాల గురించి ఇప్పటికీ ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంది. అవెంజర్స్‌ -ఎండ్‌ గేమ్‌ రిలీజ్‌ సందర్భంగా మరోసారి అవతార్‌ రికార్డుల గురించిన ప్రస్థావన వచ్చింది. దాదాపు 2.78 బిలియన్‌ డాలర్ల వసూళ్లతో అవతార్‌ రికార్డ్‌ ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఆ రికార్డును ఎండ్‌ గేమ్‌ చెరిపేస్తుందన్న ముచ్చటా సాగుతోంది. అయితే ఇదే సందర్భంలో అవతార్‌ సీక్వెల్స్‌ గురించిన ఆసక్తికర సమాచారం అందింది. ఎండ్‌ గేమ్‌ రికార్డులకు చెక్‌ పెట్టే సత్తా ఉన్న ఫ్రాంఛైజీ అవతార్‌ నుంచి వరుసగా బుల్లెట్లు దూసుకురానున్నాయ్‌. ఈ ఫ్రాంఛైజీ నుంచి వరుసగా నాలుగు సీక్వెల్స్‌ రెండేళ్ల కోసారి ట్రీట్‌ ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ముందుకు రానున్నాయి. వాస్తవానికి అవతార్‌ 2 చిత్రం 2020 డిసెంబర్‌ లో రిలీజ్‌ కావాల్సింది. కానీ ఆ ఫ్రాంఛైజీ నిర్మాణ సంస్థ ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఫాక్స్‌ ను వాల్ట్‌ డిస్నీ సంస్థ కొనేయడంతో ఈ మెర్జింగ్‌ ప్రాసెస్‌ లో సీక్వెల్‌ ఉంటుందా లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ డిస్నీ సంస్థ ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి మునుపటి కంటే రెట్టింపు విజువల్‌ ట్రీట్‌ తో తెరకెక్కిస్తోందని తెలుస్తోంది. తాజాగా డిస్నీ సంస్థ అవతార్‌ సీక్వెల్స్‌ రిలీజ్‌ తేదీలను మరోసారి ప్రకటించింది. తొలిగా అవతార్‌ 2చిత్రం 17 డిసెంబర్‌ 2021న రిలీజ్‌ కానుంది. తదుపరి 22 డిసెంబర్‌ 2023లో అవతార్‌ 3 రిలీజవుతుంది. అటుపై 12 డిసెంబర్‌ 2025న అవతార్‌ 4.. 17 డిసెంబర్‌ 2027లో అవతార్‌ 5 రిలీజవుతాయి. ఈ ఫ్రాంఛైజీలో వరుసగా నాలుగు సినిమాలు అవతార్‌ 234.5) రెండేళ్లకోసారి అభిమానుల్ని అలరించేందుకు థియేటర్లలోకి రానున్నాయి. అంటే 2021 మొదలు 2027 వరకూ ఈ ఫ్రాంఛైజీ ఫ్యాన్స్‌ కి అబ్బురపరిచే వినోదం దక్కనుంది. ఈ సిరీస్‌ సినిమాల రికార్డుల గురించి ఆసక్తికర చర్చ అంతే ఇదిగా సాగనుందన్నమాట. టైటానిక్‌ ఫేం జేమ్స్‌ కామెరూన్‌ ఈ ఫ్రాంఛైజీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పండోరా గ్రహంపై జీవించే గిరిజన జాతి (అవతార్‌) మనుగడకు భూగ్రహం వాసుల వల్ల తలెత్తిన ప్రమాదమేంటి? ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు ఏం చేశారు? అన్నది సీక్వెల్‌ సినిమాల కొనసాగింపు కథాంశం అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here