ఆస్ట్రేలియా క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు

0

మెల్‌బోర్న్‌ : అత్యాచారం కేసులో ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. వోర్‌స్టెర్‌షైర్‌ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ అయిన అలెక్స్‌ హెప్‌బర్న్‌ నిద్రిస్తున్న ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు తేలడంతో శిక్ష విదిస్తూ హెర్‌ఫర్డ్‌ క్రౌన్‌ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2017 ఏప్రిల్‌లో ఓ క్రికెట్‌ టోర్నీ సందర్భంగా తన జట్టు సభ్యుడి జో క్లార్క్‌ బెడ్రూంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు రుజువైంది. అయితే, న్యాయ విచారణలో హెప్‌బర్న్‌ ఈ అత్యాచారం చేయడానికి గల కారణాలు తెలపడంతో న్యాయస్థానంలో ఉన్నవాళ్లంతా విస్తుపోయారు. స్నేహితులతో పెట్టుకున్న ఓ పోటీలో గెలిచేందుకే ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ ఈ కీచక చర్యకు పాల్పడ్డాడట. ‘ఎవరు ఎక్కువ మంది అమ్మాయిలతో శ ంగారం చేస్తారు..?’ అనేదే ఈ పోటీ సారాంశం. ఇందుకోసం స్నేహితులంతా కలిసి ఓ వాట్సాప్‌ గ్రూపు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూపులో నిత్యం సందేశాలు పంపించుకోవడం వంటివి చేస్తుండేవారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here