Featuredజాతీయ వార్తలురాజకీయ వార్తలు

ఫలించని బుజ్జగింపు ప్రయత్నాలు

  • మకాంమార్చిన అసమ్మతి ఎమ్మెల్యేలు
  • బలనిరూపణా? మధ్యంతర ఎన్నికలా?
  • వ్యూహరచన చేస్తున్న బీజేపీ అధిష్టానం
  • 21న కేబినెట్‌ పునఃవ్యవస్థీకరణ ఉంటుంది
  • ఆజాద్‌, ఇతర నేతలకు సూచించిన సోనియాగాంధీ

బెంగళూరు :

కర్ణాటక రాజకీయాల్లో అసమ్మతి సెగ ఇంకా చల్లారలేదు. రాజీనామా చేసిన 14 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. మరోవైపు రాజీనామా చేసి ముంబయిలో తిష్ఠ వేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు మంగళవారం గోవా తరలివెళ్లారు. అసమ్మతి ఎమ్మెల్యేలంతా భాజపా ముంబయి యువ మోర్చా అధ్యక్షుడు మోహిత్‌ భార్టియాతో కలిసి రోడ్డు మార్గం గుండా గోవా వెళ్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే సోమవారం సాయంత్రం ముంబయి ¬టల్‌ను ఖాళీ చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు పుణె వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గోవాకు వెళ్లారు. గోవాలో ఓ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలు బస చేయనున్నట్లు తెలుస్తోంది. వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు గోవాకు చెందిన ఓ భాజపా నేత మీడియాకు చెప్పారు. మరోవైపు తాజా పరిణామాలపై కర్ణాటక భాజపా నేతలు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. పార్టీ సీనియర్‌ నేతలు మురుగేశ్‌ నిరాని, ఉమేశ్‌ కట్టి, జేసీ మధుస్వామి, రత్నప్రభ తదితరులు యడ్యూరప్ప నివాసానికి చేరుకుని మంతనాలు జరుపుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే బలనిరూపణతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలా లేదా మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలా అన్నదానిపై వ్యూహాలు రచిస్తున్నారు.

రాజీనామాలపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోబోను – స్పీకర్‌ రమేష్‌

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లు కన్పిస్తోంది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోబోనని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. వారంతా వ్యక్తిగతంగా తనను కలిసి రాజీనామాలపై వివరణ ఇస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. మరి స్పీకర్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ మంగళవారం స్పందించారు. ఇంతవరకూ ఏ ఎమ్మెల్యే తన అపాయింట్‌మెంట్‌ కోరలేదని చెప్పారు. అయితే తనకు ఎవరిపైనా వివక్ష లేదని చట్టానికి అనుగుణంగానే నడుచుకుంటానన్నారు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, ప్రజల వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నానని, అందువల్ల నాకు ఏదీ కష్టంగా అన్పించట్లేదన్నారు. తాజా రాజకీయ పరిస్థితులతో నాకు సంబంధం లేదని, చట్టం, రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తానన్నారు. నేను అసమ్మతి ఎమ్మెల్యేలతో మాట్లాడలేదని, వారు నాకు బంధువులు కాదని తేల్చి చెప్పారు. స్పీకర్‌ ఛాంబర్‌లోకి రాగానే నేను కాంగ్రెస్‌ వ్యక్తినన్న విషయం మర్చిపోతానని, న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని అన్నారు. నా ప్రజలు, నా తండ్రి తప్ప ఇంకెవరూ నా మీద ఒత్తిడి తీసుకురాలేరు. స్పీకర్‌గా నేను కొన్ని నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను స్పీకర్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను. ఎమ్మెల్యేలు కలిసి రాజీనామాలపై వివరణ ఇస్తే అందుకు తగిన చర్యలు తీసుకుంటానని రమేశ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. 

జులై 21న క్యాబినెట్‌ పునర్వవస్థీకరణ..

కాగా సీఎల్పీలో మెజార్టీ శాసనసభ్యులు మాత్రం ప్రతిపక్షంలో ఉందామని, పార్టీని బలోపేతం చేద్దామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భేటీకి అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి హాజరయ్యారు. తొలుత ఈమె కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం రాత్రి సోనియాగాంధీతో భేటీ అయిన సౌమ్య.. నేడు సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత మాజీ సీఎం, శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. జులై 21న క్యాబినెట్‌ పునర్వవస్థీకరణ ఉంటుందని అన్నారు. ఈ రాజకీయ సంక్షోభం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు, ¬ం మంత్రి అమిత్‌ షాల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. అసమ్మతి ఎమ్మెల్యేలు తమ వైపు ఉంటారని భావిస్తున్నామని, తమ వెంటే వారుంటారని నమ్ముతున్నామని అన్నారు. ప్రభుత్వానికి ఇప్పుడొచ్చిన డోకా ఏమీలేదన్నారు. బీజేపీ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. ఇదిలా ఉంటే కర్ణాటక తాజా రాజకీయాలపై సోనియాగాంధీ దృష్టిసారించారు. వెంటనే కర్ణాటక వెళ్లి సంక్షోభానికి తెరదించాలని ఆమె కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆజాద్‌ను ఆదేశించారు. దీంతో ఆజాత్‌, ఇతర నేతలతో కలిసి కర్ణాటక పయణమయ్యారు. ఇదిలాఉంటే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం కూడా విధానసౌధలో భేటీ అయ్యింది. సీనియర్‌ నేతలు సిద్ధరామయ్య, ప్రియాంక్‌ ఖర్గే ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొని తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగి వస్తే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నిన్న సంకీర్ణ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close