జగన్‌పై హత్యాయత్నం!

0

విశాఖపట్నం (ఆదాబ్‌ హైదరాబాద్‌): విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌పై దాడి జరిగింది. లాంజ్‌లో వేచి ఉన్న జగన్‌పై అక్కడే పనిచేస్తున్న వెయిటర్‌ కత్తి తీసుకొని దాడి చేయడం కలకలంరేపింది. ఈ దాడిలో జగన్‌ ఎడమ భుజానికి గాయమయ్యింది. గురువారం ఉదయం జగన్‌.. విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా రు. ఫైలట్‌ కోసం లాంజ్‌ వెయిట్‌ చేస్తున్న సమయంలో.. టీ ఇచ్చేందుకు ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్‌లో పనిచేసే వెయిటర్‌ శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. లాంజ్‌లో జగన్‌ను పలకరించాడు. 160సీట్లు వస్తాయా సార్‌ అంటూ.. సెల్ఫీ తీసుకొంటానని అడిగాడు. సెల్ఫీ అడగటంతో.. జగన్‌ దగ్గరకు రమ్మన్నారు. వచ్చీరాగానే వెయిటర్‌ తన జేబులో నుంచి కత్తి తీసుకొని జగన్‌ భుజంపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడ్ని పట్టుకొని అరెస్ట్‌ చేశారు. కోడి పందాలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకోగానే.. జగన్‌ సార్‌ విూరు గెలవాలి, విూరంటే నాకు అభిమానం అంటూ నిందితుడు పెద్దకేకలు వేశారు. కత్తిగాటుతో ఎడమ చేతి నుంచి రక్తం కారడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది జగన్‌కు ప్రథమచికిత్స నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. జగన్‌పై దాడి జరిగిందని తెలుసుకున్న వైసీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు.

దాడి ఘటనపై గవర్నర్‌ ఆరా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌ ఆరాతీశారు. ఏపీ డీజీపీకి ఫోన్‌ చేసిన గవర్నర్‌ విపక్ష నేతపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై తనకు తక్షణమే నివేదిక పంపాలని డీజీపీని ఆదేశించారు.దాడికి పాల్పడిన వారిని వదిలేది లేదు – ఏపీ ¬ంమంత్రి చినరాజప్ప విశాఖలో ఎయిర్‌ పోర్ట్‌లో వైఎస్‌ఆర్‌ పార్టీ అధినేత జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ ¬ంశాఖా మంత్రి చిన రాజప్ప అన్నారు. ఈ సదంర్భంగా దాడి వివరాలను తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఠాణెళిలంక ప్రాంతానికి చెందిన జనిపెల్ల శ్రీనివాస్‌ అనే యువకుడు జగన్‌పై దాడి చేశారన్నారు. ఎయిర్‌ పోర్ట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న అతను విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో జగన్‌ని చూసి సెల్ఫీ తీసుకుంటా అని వెళ్లారని.. అనంతరం కత్తితో దాడి చేశారన్నారు. నీకు 160 సీట్లు వస్తాయా? అంటూ జగన్‌ని కత్తితో పొడిచాడని, దాడి జరిగిన వెంటనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారని చినరాజప్ప తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని దాడిని ఖండిస్తున్నామని, అతడు ఎవరు? ఏమిటి? ఏ పార్టీకి చెందిన వాడు ఇలాంటి పూర్తి వివరాల్ని సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ అర్ధం చేసుకోవాలని కోరుతున్నానని, భద్రతా వైఫల్యం వల్లే దాడి జరిగిందన్న వైసీపీ వాదనకు చినరాజప్ప ఖండించారు. జగన్‌ సెల్ఫీ అనగానే ముందుకొచ్చి ముద్దులంటాడంటూ అతడు జగన్‌ పొగడటానికి వచ్చాడని, అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రజాప్రతినిధిపై ఉంటుందన్నారు. మాతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు మేం జాగ్రత్తగా ఉంటున్నామని అన్నారు. ఏది ఏమైనా.. ఎయిర్‌ పోర్ట్‌పై జరిగిన ఈ దాడిని సహించేది లేదని, అతడు ఎంతవాడైనా చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివారాలను సేకరిస్తున్నామన్నారు ¬ం మంత్రి తెలిపారు.

నిందితుడి జేబులో లెటర్‌ ఉంది – ఏపీ డీజీపీ ఠాకూర్‌

జగన్‌కు అత్యంత సన్నిహితంగా వెళ్లి మరీ నిందితుడు శ్రీనివాస్‌ పథకం ఎటాక్‌ చేశాడని డీజీపి ఆర్‌పీ ఠాకూర్‌ పక్రటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ జేబులో ఒక లెటర్‌ను (ఎనిమిది పేజీల) కూడా కనుగొన్నామని చెప్పారు. దీన్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తమకు అందించారని తెలిపారు. ఈ దాడికి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు. అయితే సీఐఎస్‌ఎఫ్‌ రిపోర్టు ఆధారంగా ఇప్పటికే కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితుడి ఎడమ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పబ్లిసిటీ కోసమే చేశాడా, లేక ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనేది విచారిస్తామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు ఎయిర్‌పోర్టులోకి కత్తితో నిందితుడు ఎలా ప్రవేశించాడనేది విచారిస్తున్నామని తెలిపారు. అలాగే దాడికి గురైన ప్రతిపక్షనేత జగన్‌ను విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించినట్టు చెప్పారు.

నేను క్షేమంగానే ఉన్నా

నేను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్‌పై దాడి తీవ్ర కలకలం రేపింది. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ఉండగా.. ఆయనతో సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో ఆయన భుజానికి గాయమైంది. దీంతో తొలుత విశాఖలోనే ప్రథమ చికిత్స చేయించుకున్నజగన్‌.. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్‌కు చేరుకొని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ మేరకు ఆయన తన ఆరోగ్య సమాచారంపై ట్వీట్‌ చేశారు. తాను దేవుడి దయవల్ల క్షేమంగానే ఉన్నానని, ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోందన్నారు. ఇలాంటి చర్యలను తనను భయపెట్టలేవని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్‌ జగన్‌ ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం కోసం తాను చేసే పోరాటాలను ఇటువంటి పిరికిపంద చర్యలు ఆపలేవని ట్వీట్‌ చేశారు. కాగా హైదరాబాద్‌లో జగన్‌ చికిత్సపొందుతున్న ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొందరు అభిమానులు అక్కడికి చేరుకొని జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. మరో వైపు ఆయన సతీమణి వైఎస్‌ భారతి, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కాగా జగన్‌ భుజానికి మూడు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here