Featuredస్టేట్ న్యూస్

మంత్రి మల్లన్న అండతో పోచమ్మ కుంట మాయం

చెరువులను మూసేందుకు సహకరిస్తున్న మిషన్‌ కాకతీయ మరాఠీ మల్లేష్‌

చెరువులో ఇండ్ల నిర్మాణాలవుతున్న పట్టించుకొని అధికారులు

కోర్టు నుండి ఏదో తెచ్చుకున్నారుకట్టుకుంటున్నారు అంటున్న ఎమ్మార్వో

అవును మట్టితో నింపుతున్నారు రెండు రోజుల్లో తొలగిస్తారని చెబుతున్న ఇరిగేషన్‌ ఏ.ఈ

బోడుప్పల్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): బోడుప్పల్‌ పరిధిలోని పోచమ్మ కుంట చెరువును మట్టితో పూడు స్తున్నారని, అధికారుల కళ్ళముందే చెరువును మాయం చేస్తున్నా పట్టించుకోకపోవడం తెలంగాణ ప్రభుత్వం లోనే సాధ్యమవుతుందని బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరాఠీ మల్లేష్‌ ఆరోపించారు.ఈ వ్యవహారంపై మేడిపల్లి మండల ఎమ్మార్వో ను కలిసి ఫిర్యాదు చేయగా తనకేమీ తెలియదని కోర్టు నుండి ఏదో తెచ్చుకున్నారు, కట్టుకుంటున్నారు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు.ఇది గేషన్‌ అధికారులకు పోచమ్మ కుంట విషయమై వివరించగా అవును మట్టితో నింపుతున్నారు రెండు మూడు రోజుల్లో తీసేస్తారని చిన్న పిల్లాడికి చెప్పినట్లుగా ఇరిగేషన్‌ ఏ. ఇ. ఆదిత్య చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తపరిచారు.పోచమ్మ కుంట చెరువు వాస్తవానికి 21 ఎకరాలు గా ఉంటుందని మిషన్‌ కాకతీయ పథకం కింద నిధులు మంజూరు అయిన చెరువును కాపాడుకోలేక పోతున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.స్థానిక శాసనసభ్యులు మంత్రి మల్లారెడ్డి అండతోనే పోచమ్మ కుంట చెరువు ను మాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలోనే మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువులలో పూడిక తీత పనులను చేస్తుంటే ఒక ప్రక్కకాంట్రాక్టర్లు రోడ్లను త్రవ్వి ప్రక్కనే ఉన్న చెరువును నింపుతున్న అధికారులు చూసిచూడనట్లుగా వ్యవరిస్తున్న వైనం

పోచమ్మకుంటలో మట్టిని నింపిన దృశ్యం

..బోడుప్పల్‌ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచెర్ల పోచమ్మకుంటకు ప్రభుత్వం మిషన్‌ కాకతీయ క్రింద ఐదులక్షలు మంజూరు కాగా రెండులక్షలతో మాత్రమే పనులు చేసారు.మిగతా పనులు పెండింగ్‌లో ఉండగా చెరువును పట్టించుకోకపోగా చెరువును పూడ్చి వేస్తూ, అక్రమంగా ఇండ్లు నిర్మాణాలు జరుగుతున్న అధికారులు అటువైపు కన్నేత్తి చూడకపోవడం శోచనీయం.ఇలాగే అక్రమానికి గురైతే భవిష్యతులో ఇక్కడి ప్రజలు బిందెడు నీటి కోసంఅష్టకష్టాలు పడవలసి వస్తుంది.అలాంటి దుస్థితి రాకుండా చూడవలసిన భాధ్యత అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఉండాలి.ఒక వైపు కాంట్రాక్టర్‌ చెరువును పూడ్చుతుంటే ఇదే అదునుగా అక్రమార్కులు చెరువును కబ్జాచేసి దర్జాగా ఇండ్ల కట్టేస్తున్నారు. చెరువులో పూడిక తీయక పోయిన పర్వాలేదు కాని చెరువులు పూడ్చడం ఏమిటని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అధికార పార్టీ అండదండలు ఉంటె ఎంతటి అక్రమైన చేయొచ్చని నిరూపించారు.ఒక్కప్పుడు నాలుగు ఎకరాలు ఉన్న చెరువును ఇప్పుడు ఒక ఎకరము కూడా లేకుండా కబ్జాదారులు కబ్జాచేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.మూడు సంవత్సరాలైన మున్సిపాలీటీ నుండి నగర పాలక సంస్థగా మారినకూడా ఇంకా గ్రామ పంచాయితీ పర్మీషన్‌లతోనే ఇండ్ల నిర్మాణాలు జరుగుతుండడం గమనార్థం.దీనితో ప్రభుత్వానికి వచ్చే కోట్ల ఆదాయం గండి పడుతుంది.కోసమెరుపు ఏమిటంటే ఇప్పటికి గ్రామపంచాయితీ పర్మీషన్‌ లు ఎక్కడి నుండి వస్తున్నాయే అధికారులు ఎంక్వయిరీ చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.

అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం: అధిత్య , ఇరీగేషన్‌ ఏఈ

చెరువులో మట్టి ఎవరు పోస్తున్నారో తెలుసుకోని వారిపై చర్యలు తీసుకుంటాం.ఇక్కడ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలన్ని ఎఫ్‌టిఎల్‌ పరిధిలోకే వస్తాయి.ఇక్కడ జరిగే అక్రమ ఇండ్ల నిర్మాణాలను వెంటనే అపి వేయించి, నిర్మాణదారులపై శాఖ పరంగా చర్యలు తీసుకుంటాము.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close