Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

అడుగడుగునా జన నీరాజనాలు..

అడవిబిడ్డ శ్రీమతి సత్యవతి రాథోడ్ కు అభినందనలు-మంత్రిగా సొంతూరుకు వస్తున్న ప్రియతమ నేతకు దారి పొడవునా  సన్మానాలు..-టి.ఆర్.ఎస్ కి జేజేలు…సీఎం కేసీఆర్ కి జయహోలు…మంత్రి సత్యవతికి జిందాబాద్ లు-హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వరకు అభిమానుల కేరింతలు..-మంత్రిగా మహబూబాబాద్ కి శ్రీమతి సత్యవతి తొలి పర్యటనకు అవధులు లేని సంతోషాల ఆహ్వానాలుమహబూబాబాద్(ఆదాబ్ హైదరాబాద్).తనని నాయకురాలిగా చేసిన సొంత జిల్లాకు మంత్రిగా సీఎం కేసీఆర్  బాధ్యతలు ఇచ్చిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ కి బయల్దేరిన శ్రీమతి సత్యవతి రాథోడ్ కి  అడుగడుగునా అభిమానులు, నాయకులు, పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన మంత్రి శ్రీమతి సత్యవతి తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో కొద్దిసేపు ఆగి..అక్కడి మీడియా మిత్రులతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నిక ఎక్కడైనా గెలుపు టి.ఆర్.ఎస్ పార్టీదే నని చెప్పారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గులాబీ విజయం సునాయాసమని అభివర్ణించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే ఉప ఎన్నిక వచ్చిందని, గెలుపు టి.ఆర్.ఎస్ కు వస్తుందని చెప్పారు. అనంతరం పెద్ద వంగర చేరుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి పూలమాల వేసి తొర్రూరు కి వచ్చారు.తొర్రూరులో అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం దంతాలపల్లి లో ఓపెన్ టాప్ జీప్ ఎక్కి, నర్సింలు పేటలో అందరిని కలుపుకొని, మరిపెడలో జనంతో మమేకమై..కొరివి శ్రీ వీరభద్రస్వామి ని దర్శించి, ఆయన ఆశీర్వాదం తీసుకొని మహబూబాబాద్ కి మంత్రిగా చేరుకొని అమరవీరుల కి మరోసారి నివాళులు అర్పించి,  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలిగా కొనసాగారు. సర్పంచి నుంచి మంత్రి వరకు తమ అడవిబిడ్డ ప్రస్థానం చూసి మహబూబాబాద్ మురిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ లో గిరిజన మహిళకు తొలి మంత్రిగా స్థానమిచ్చి గౌరవించినందుకు పులకించింది…జయహో కేసీఆర్… జిందాబాద్ సత్యవతి అంటూ నినదించింది.ఆడపడుచు శ్రీమతి మంత్రి సత్యవతి, అన్న సీఎం కేసీఆర్, అమ్మ వంటి టి .ఆర్.ఎస్ పార్టీ వెంటే ఉంటామని…బంగారు తెలంగాణ నిర్మాణం లో భాగం అవుతామని మానుకోట జనం కి హిమ్మతిచింది

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close