Featuredస్టేట్ న్యూస్

అశోకుడు నాటింది చెట్లు, కెసిఆర్‌ పెట్టింది బార్లు

  • టీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో
  • హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనా ఉత్తి మాటలే
  • ఎన్నికల ముందు కెసిఆర్‌ అభివద్ధి జపం
  • భాజపా అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌

కుద్బుల్లాపూర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అశోక చక్రవర్తి నాడు చెట్లు నాటితే నేడు కెసిఆర్‌ రాష్ట్రంలో రోడ్లకు ఇరువైపులా బార్లు పెట్టి బంగారు తెలంగాణను కాస్త బార్ల తెలంగాణ గా మార్చా రన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలోని రాజీవ్‌ గహకల్పలో ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో శంఖారావ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌ నిజాంపేట కార్పొరేషన్‌ నుండి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని కల ముందే కెసిఆర్‌ అభివ ద్ధి జపం చేస్తారని,ఆ తర్వాత ఫాం హౌస్‌ కె పరిమితమవుతారన్నారు .ఎంఐఎం నాయకుల మెప్పు కోసం మున్సిపల్‌ నిబంధనలను తుంగలో తొక్కి తెలంగాణను ఓవైసీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు . టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి ఒక్కటేనని అనేక మంది పార్టీ లో చేరుతున్నా రన్నారు.మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా కెసిఆర్‌ మాటలకు గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు .

కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే గెలిచిన మరుక్షణమే అమ్ముడు పోతారని,అదే బిజెపి అభ్యర్థులు గెలిస్తే ప్రజలకు సేవకులై సేవ చేస్తారన్నారు .కోట్ల రూపాయలు ఖర్చు చేసి ,మద్యం ఏరులై పారించినా భాజపా విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తే కెసిఆర్‌ ఫామ్‌ హౌస్‌ కి పాలేరులుగా మారుతారని ఎద్దేవా చేశారు .టిఆర్‌ఎస్‌ నాయకులు కెసిఆర్‌ బాహుబలి అని గొప్పలు చెప్పుకుంటున్నారని, పార్టీలో ఒక్కరైనా కట్టప్ప ఉన్నాడా అని ప్రశ్నించారు . నిజాంపేట ప్రజలు భాజపాకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్‌ రావు, మాజి మంత్రి నర్సింహులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి ,జిల్లా పార్టీ అధ్యక్షులు కాంతారావు సుభాష్‌ చందర్‌ జీ, మాజీ ఎంపిపి కొలను హనుమంత రెడ్డి,నియోజకవర్గ కన్వీనర్‌ బక్క శంకర్‌ రెడ్డి, మేయర్‌ అభ్యర్థి నీరజారెడ్డి ,ఎవిఆర్‌ మూర్తి ,ధనుంజయ తదితరులు ఉన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close