వివాహ విందులో ఘర్షణ.. యువకుడు మృతి

Updated:13/05/2018 11:07 AM

younger died due to friction in wedding party

జిల్లాలోని మోతెమాలవాడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వివాహ విందులో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా మరొక యువకుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మద్యం సేవిస్తుండగా మిత్రుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో ఇద్దరు కత్తిపోట్లకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా అభిలాష్(23) అనే యువకుడు మృతిచెందాడు. కిరణ్(22) అనే మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.